For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ప్చ్.. ముంబై ఇండియన్స్‌లో మిగిలేది ఆ నలుగురే.. సూర్యకు నో చాన్స్!

 4 players which Mumbai Indians should retain for IPL 2022
IPL 2022 Mega Auction : Mumbai Indians Might Retain These 4 Players For IPL 2022 || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ పది జట్లతో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కొత్తగా రెండు జట్లు చేరడంతో ఆటగాళ్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాంతో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్‌‌ మధ్య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి 2021లోనే ఈ మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగాల్సి ఉన్నా.. కరోనా దెబ్బకు ఏడాది వాయిదా పడింది. రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే‌ అవకాశం ఉంటుందని తెలిపింది. అధికారికంగా ప్రకటించికపోయినా.. విధివిధానలు ఇలానే ఉండనున్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్ పాలసీ తాజా నిబంధనల ప్రకారం ముగ్గురు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లేదంటే ఇద్దరు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు.

ముంబైకి డిస్ అడ్వాంటేజ్..

ముంబైకి డిస్ అడ్వాంటేజ్..

ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ నిబంధన డిస్ అడ్వాంటేజ్‌గా మారనుంది. స్ట్రాంగ్ ప్లేయర్లను కలిగి ఉన్న ముంబై జట్టు.. తాజా రూల్‌తో అందర్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉన్న ముంబై ఏ ఆటగాళ్లను ఉంచుకుంటుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ముంబై ఇండియన్స్ మిగతా ఫ్రాంచైజీలకు భిన్నంగా ముగ్గురు భారత ఆటగాళ్లను ఓ విదేశీ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోనుంది. గత కొన్నేళ్లుగా ముంబై తరఫున సత్తా చాటుతున్న సూర్యకుమార్ యాదవ్‌‌ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్.. తమ కెప్టెన్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకునే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్.. ముంబైకి ఏకంగా ఐదు టైటిళ్లు అందించాడు. ఇలాంటి హై క్వాలిటీ కెప్టెన్‌ను వదులుకునే సాహసం ముంబై చేయదు. ఎందుకంటే రోహిత్ ఓ ఐకానికి ప్లేయర్. అలాంటి కెప్టెన్ మళ్లీ దొరకలాంటే కష్టం. అంతేకాకుండా లీగ్ చరిత్రలోనే రోహిత్ నాలుగో హయ్యెస్ట్ స్కోరర్. 202 మ్యాచ్‌ల్లో 5480 రన్స్ చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. 2013 నుంచి రోహిత్ ముంబైకి ఆడుతున్నాడు.

జస్‌ప్రీత్ బుమ్రా

జస్‌ప్రీత్ బుమ్రా

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సైతం ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుంది. ఈ తరం క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ పేసర్. టీ20 ఫార్మాట్‌లో అతని బౌలింగ్ అసాధారణం. ఈ యార్కర్ల కింగ్ ఇప్పటికే 99 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24.14 సగటుతో 115 వికెట్లు తీశాడు. ముంబై విజయాల్లో బుమ్రాది కీలక పాత్ర. 2013లో ముంబై తరఫునే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించిన బుమ్రా.. అనతి కాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు. లసిత్ మలింగా రిటైర్మెంట్ తర్వాత ముంబైకి ఆ స్థాయి కలిగిన జస్‌ప్రీత్ బుమ్రా సేవలు అవసరం. తదుపరి సీజన్లలో రాణించాలంటే అతను జట్టులో ఉండాల్సిందే.

హార్దిక్ పాండ్యా..

హార్దిక్ పాండ్యా..

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కూడా వదులుకునే సాహసం ముంబై ఇండియన్స్ చేయదు. పాండ్యా చేయిదాటితే వేలంలో భారీ ధర పలుకుతాడనే విషయం ముంబైకి తెలుసు. 2015 నుంచి ముంబైకి ఆడుతున్న పాండ్యా.. అటు ఫ్రాంచైజీ ఇటు అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఈ మధ్య బౌలింగ్ చేయడం లేదు కానీ.. అంతకుముందు బ్యాట్, బంతితో దుమ్ములేపాడు. ఓ దశలో జూనియర్ కపిల్ దేవ్ అంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 42 వికెట్లతో 1401 రన్స్ చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే హార్దిక్‌ను ముంబై ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు.

కీరన్ పొలార్డ్..

కీరన్ పొలార్డ్..

ముంబై సగం బలం వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ కీరన్ పొలార్డ్. రోహిత్, బుమ్రా, హార్దిక్ ఒక ఎత్తు అయితే.. పోలార్డ్ ఒక్కడే మరో ఎత్తు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఎన్నో చిరస్మరణీ విజయాలందుకుంది. విదేశీ కోటాలో ముంబై అతన్ని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. పైగా పొలార్డ్ ముంబై వైస్ కెప్టెన్. రోహిత్ గైర్హాజరీలో జట్టును నడిపించగల సమర్థుడు.

2010 నుంచి ముంబైకే ఆడుతున్న పొలార్డ్.. లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో విజయాలందించాడు. 171 ఐపీఎల్‌ మ్యాచ్‌లో 3191 రన్స్‌తో 63 వికెట్లు తీశాడు. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులతో అజేయంగా నిలిచిన పొలార్డ్.. ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు.

Story first published: Wednesday, July 7, 2021, 16:18 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+