IPL 2022: కార్తీక్, కమిన్స్‌కు నో చాన్స్.. మోర్గాన్ లీగ్‌కే డౌట్.. కేకేఆర్ రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ పది జట్లతో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కొత్తగా రెండు జట్లు చేరడంతో ఆటగాళ్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దాంతో డిసెంబర్ మధ్యలో మెగా ఆక్షన్‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి 2021లోనే ఈ మెగా ఆక్షన్ జరగాల్సి ఉన్నా.. కరోనా దెబ్బకు ఏడాది వాయిదా పడింది. రిటెయిన్ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. అధికారికంగా ప్రకటించికపోయినా.. విధివిధానాలు ఇలానే ఉండనున్నాయని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్ పాలసీ తాజా నిబంధనల ప్రకారం ముగ్గురు ఇండియన్స్, ఒకరు ఫారిన్ ప్లేయర్. లేదంటే ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు. మెగా వేలం నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ పూర్తవ్వకముందే.. 2022 సీజన్ సందడి మొదలైంది. జట్ల స్వరూపం పూర్తిగా మారనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కార్తీక్, కమిన్స్‌కు నో చాన్స్..
ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ మెగా వేలం కలిసి రానుంది. అప్పుడెప్పుడో గౌతం గంభీర్ సారథ్యంలో దుమ్మురేపిన ఆ జట్టు ఆ తర్వాత సరైన నాయకత్వంలేక ఇబ్బంది పడుతూనే ఉంది. దినేశ్ కార్తీక్ తన వల్ల కాదని తప్పుకోగా.. ఇయాన్ మోర్గాన్ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ జట్టును పూర్తి ప్రక్షాళన చేయడానికి మెగా వేలం వాడుకోవాలని చూస్తోంది.
తాజా సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. రెండు మాత్రం గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేకున్నా.. సమష్టి ప్రదర్శన కొరవడటం ఆ జట్టు కొంపముంచుంది. ఈ క్రమంలోనే కొత్త ఆటగాళ్లపై కన్నేసిన ఆ జట్టు నిబంధనల ప్రకారం పవర్‌ఫుల్ ప్లేయర్లను రిటైన్ చేసుకోనుంది. మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్, ప్రస్తుతం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు రూ 15 కోట్లకు కొనుగోలు చేసిన కమిన్స్‌కు కూడా కేకేఆర్ ఉద్వాసన పలికే అవకాశం ఉంది.

శుభ్‌మన్ గిల్..
కేకేఆర్ ముగ్గురు భారత ఆటగాళ్లతో పాటు ఓ ఫారిన్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు తొలి ప్రాధాన్యత దక్కనుంది. టీమిండియా భవిష్యత్తు తారాగా ఎదుగుతున్న శుభ్‌మన్ కోసం ఇతర ఫ్రాంచైజీలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాయి. కాబట్టి అతన్ని వేలంలో పంపించి కేకేఆర్ రిస్క్ చేయకపోవచ్చు.
తాజా సీజన్‌లో పెద్దగా రాణించకపోయినా.. గత సీజన్లలో పర్వాలేదనిపించాడు. టీమిండియా తరఫున కూడా కొన్ని మంచి ప్రదర్శనలు కనబర్చాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 48 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ 30.60 సగటుతో 1071 రన్స్ చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలున్నాయి. కొంచెం స్లోగా ఆడుతానే అపవాదున్నా.. నిలకడగా రాణించే సామర్థ్యం అతని సొంతం.

నితీష్ రాణా..
రెండో ప్లేయర్‌గా కేకేఆర్ నితీష్ రాణాను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. గత నాలుగు సీజన్లుగా(2017, 2018, 2019, 2020) నితీశ్ రాణా నిలకడగా రాణిస్తున్నాడు. 300కు పైగా పరుగులు చేశాడు. తాజా సీజన్‌లోనూ పర్వాలేదనపించాడు. 7 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 201 రన్స్ చేశాడు. ఈ పెర్ఫామెన్స్‌తోనే టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఓవరాల్‌గా 67 మ్యాచ్‌లు ఆడిన నితీష్ రాణా.. 13 హాఫ్ సెంచరీలతో 1638 రన్స్ చేశాడు. నిలకడగా రాణించే నితీష్ రాణాను కేకేఆర్ వదులుకోదు.

ఆండ్రీ రస్సెల్..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్‌ను కేకేఆర్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. గత రెండు సీజన్లలో అతను అంచనాలు అందుకోలేకపోయినా రస్సెల్‌ను రిటైన్ చేసుకుంటుంది. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే రస్సెల్‌ను వదులుకునే సాహసం ఏమాత్రం చేయదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బ్యాటింగ్ అసాధారణం.
ప్రత్యర్థి బౌలర్లు అతనికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతారు. అంతేకాకుండా అతను మంచి బౌలర్ కూడా. పరుగులు కట్టడి చేయడంలో అతనికి సాటి లేరు. ఐపీఎల్ 2021 సీజనల్‌లో అతను పటిష్ట ముంబై ఇండియన్స్‌పై 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 163 రన్స్‌తో 7 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి సూపర్ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్ కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.

వరుణ్ చక్రవర్తీ
యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో దుమ్మురేపిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని కూడా కేకేఆర్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన అతను 17 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను కూడా అందుకున్నాడు. ఇక తాజా సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. తనదైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టే వరుణ్‌ను కేకేఆర్ వదులుకోదు. ఒకవేళ్ల రెండో ఓవర్ సీస్ ప్లేయర్ కావాలనుకుంటే మాత్రం సునీల్ నరైన్ తీసుకోవచ్చు. కానీ వరుణ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్, టీ20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా కేకేఆర్ రిటైన్ చేసుకునే జాబితాలో మార్పులు ఉండవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications