
సురేశ్ రైనాకు నో చాన్స్..
ఈ నయా రూల్‌తో త్రీ టైమ్ చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లో దుమ్ములేపిన ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది.
డాడీస్ ఆర్మీగా ముద్ర పడ్డ చెన్నై జట్టు.. సీనియర్ ఆటగాళ్లను కొనసాగిస్తుందా? లేక యువ ఆటగాళ్లను తీసుకుంటుందా? అనేది చూడాలి. అయితే తాజా రిటైన్ నిబంధనల నేపథ్యంలో సీఎస్‌కే ముగ్గురు భారత ఆటగాళ్లు, ఓ విదేశీ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ జాబితాలో సురేశ్ రైనాకు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం రైనాకు ప్రతికూలంగా మారింది.

రవీంద్ర జడేజా..
సీఎస్‌కే రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో రవీంద్ర జడేజా మొదటి ఆటగాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ త్రీడైమన్షన్ ప్లేయర్ అయిన జడేజాను వదులుకునే సాహసం ఎట్టి పరిస్థితుల్లో సీఎస్‌కే చేయదు. ఒక్కసారి జడేజా వేలానికి వస్తే ఇతర ఫ్రాంచైజీలు ఎలా పోటీపడతాయో ఆ జట్టుకు బాగా తెలుసు. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో విజయాన్నందించాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాది తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోను రాణిస్తున్నాడు. 2012 నుంచి సీఎస్‌కేకు ఆడుతున్న జడేజా.. టీమ్ సస్పెన్షన్ అయిన రెండేళ్లు ఇతర జట్లకు ఆడినా.. 2018లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

సామ్ కరన్..
ఇక జట్టులో మరో ఆల్‌రౌండర్ అయిన సామ్ కరన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అటు బంతితో ఇటు లోయారార్డర్‌లో బ్యాట్‌తో రాణించే సత్తా ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సొంతం. ఈ తరం ప్రపంచ క్రికెట్‌లో అతనో సూపర్ ఆల్‌రౌండర్. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2019లోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఆల్‌రౌండర్ వరుసగా మూడు సీజన్లలో సత్తా చాటాడు. ఇప్పటి వరకు 30 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు తీశాడు. 2 హాఫ్ సెంచరీలతో 333 రన్స్ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల పాత్ర చాలా కీలకం. కాబట్టి సూపర్ ఆల్‌రౌండర్ అయిన సామ్ కరన్‌ను సీఎస్‌కే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు.

రుతురాజ్ గైక్వాడ్
భవిష్యుత్తును దృష్టిలో ఉంచుకొని బలమైన టీమ్‌ను సిద్దం చేస్తామని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే తెలియజేశాడు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. యూఏఈ వేదికగా అరంగేట్ర సీజన్ ఆరంభంలో తడబడ్డ రుతురాజ్ చివర్లో తన సత్తా ఏంటో తెలియజేశాడు.
ఐపీఎల్ 2021 సీజన్‌లోను తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్.. 36.36 సగటుతో 400 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి. ఈ పెర్ఫామెన్స్‌తో టీమిండియా పిలుపు అందుకున్నాడు. శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. టీమిండియా భవిష్యత్తు కిరణంగా ఎదుగుతున్న రుతురాజ్‌ను సీఎస్‌కే రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహేంద్ర సింగ్ ధోనీ
ఇక జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సీఎస్‌కే రిటైన్ చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు, ఫిట్‌నెస్ అతను కొనసాగుతాడా? అనే సందేహం కలిగిస్తున్నా.. మరో రెండేళ్లపాటు జట్టుతో ఉంటాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథే మీడియాకు తెలిపాడు. దీన్ని బట్టి మహీని రిటైన్ చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. 2008 అరంగేట్ర సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న మహీ.. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. సస్పెన్షన్ టైమ్‌లో ఇతర జట్టుకు ఆడినా.. రీఎంట్రీ మళ్లీ సారథిగా దుమ్ములేపి టైటిల్ అందించాడు. అయితే గత రెండేళ్లుగా అతని ఆటలో జోష్ కనిపించడం లేదు. కానీ కెప్టెన్‌గా మాత్రం మహీ అదరగొడుతున్నాడు. అయితే ధోనీ ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ అతను ఈ సీజన్ తర్వాతే ఆటకు గుడ్‌బై చెబితే మాత్రం.. సీఎస్‌కే సురేశ్ రైనాను రిటైన్ చేసుకునే చాన్సుంది.


Click it and Unblock the Notifications
