నాగ్‌పూర్: నాగ్‌పూర్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. దీంతో టీమిండియా ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండగానే ప్రీడమ్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
దీంతో పాటు గత తొమ్మిదేళ్లుగా విదేశాల్లో టెస్టు సిరీస్ ఓడిపోని దక్షిణాఫ్రికా రికార్డు విజయాలకు ఫుల్ స్టాప్ పడింది. భారత్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు సఫారీ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా డుప్లెసిస్ 39, ఆమ్లా 39 పరుగులు చేయగా ఎల్గర్ 18, డుమిని 19, విలాస్ 12, ఏబీ డివిల్లియర్స్ 9, హార్మర్ 8, రబాడ 6 స్వప్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నారు.

ఈ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 7 వికెట్లు తీసుకోగా, అమిత్ మిశ్రా 3 వికెట్లు తీసుకున్నారు.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అశ్విన్‌కే:
మూడో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 98 పరుగులిచ్చి 12 వికెట్లు తీసిన స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
భారత్ తొలి ఇన్నింగ్స్: 215 (ఆలౌట్)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 79 (ఆలౌట్)
తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం - 136
136 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 173 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు 310 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 32/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 185 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్ రెండో ఇన్నింగ్స్: 173 (ఆలౌట్)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 185 (ఆలౌట్)
8వ వికెట్:
జట్టు స్కోరు 167 పరుగుల వద్ద విలాస్ రూపంలో దక్షిణాఫ్రికా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలాస్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో హార్మర్ 0, రబాడ 0 పరుగులతో ఉన్నారు.
7వ వికెట్:
జట్టు స్కోరు 164 పరుగుల వద్ద డుమిని రూపంలో దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా 82 ఓవర్లకు గాను 7 వికెట్లను నష్టపోయి 167 పరుగుల చేసింది.
6వ వికెట్:
జట్టు స్కోరు 151 పరుగుల వద్ద డుప్లెసిస్ రూపంలో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 76 ఓవర్లకు గాను 6 వికెట్లను నష్టపోయి 151 పరుగులు చేసింది. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్‌లో డుప్లెసిస్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా విజయానికి 159 పరుగులు చేయాల్సి ఉంది.
5వ వికెట్:
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఆమ్లాను 39 పరుగుల వద్ద అమిత్ మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. 58 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును ఆమ్లా, డుప్లెసిస్ జోడీ నిలకడగా రాణించి ఐదో వికెట్‌కి 72 పరుగులు జతచేశారు.
భారత్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న ఆమ్లా (39), డుప్లెసిస్ (35) నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కి అజేయంగా 273 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ స్ఫిన్ దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు ఇబ్బందులు పడుతున్నారు. 32 ఓవర్లకు గాను 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 78 పరుగులు చేసింది.
9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో ఏబీ డెవిలియర్స్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. మూడో టెస్టులో విజయానికి ఆ జట్టు ముందున్న 231 పరుగుల సాధిచడం కష్టమే. ఈనెల 25న ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 79 పరుగులకే ఆలౌటైంది.
3వ టెస్టు: 2వ రోజు ఆట పూర్తి సమాచారం అనంతరం 136 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 173 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు 310 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 32/2 ఓవర్ నైట్ స్కోరుతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.
32/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఎల్గర్ (18) అశ్విన్ బౌలింగ్‌లో ఫీల్డర్ పుజారాకి సునాయాస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 270 పరుగులు చేయాల్సి ఉంది.