25ఏళ్ల రికార్డును తిరగరాసిన భారత స్పిన్నర్లు
నాగ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు విజృంభించడంతో 25ఏళ్ల రికార్డును భారత్ తిరగరాసింది.
విసిఏ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రెండో రోజైన గురువారంనాటి మ్యాచులో అశ్విన్, జడేజా, మిశ్రాలు తిప్పేయడంతో దక్షిణాఫ్రికా 10 వికెట్లను కోల్పోయింది. అత్యల్ప స్కోరు 79 పరుగులకే, 33.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలైటై భారత రికార్డును మెరుగుపర్చింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 136 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్ ధాటికి తట్టుకోలేక 79 పరుగులకే ఆలౌటైంది. కాగా, భారత్ చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైన టెస్ట్ జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 5/32తో రాణించి 14సార్లు టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలరయ్యాడు. కాగా, జడేజా కూడా 4/33 ఆకట్టుకున్నాడు. మిశ్రా కూడా మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు.
11/2తో గురువారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 23.1 ఓవర్లు ఆడి మిగితా 8 వికెట్లను కోల్పోయి 68 పరుగులు చేసింది. కాగా, ఇంతకుముందు 1990లో ఛండీఘర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచులో భారత్ 82 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసింది.
భారత్ చేతిలో అత్యల్ప స్కోరుకే ఆలౌటైన టాప్ 10జట్లు ఇవే
79-దక్షిణాఫ్రికా, నాగపూర్, 2015
82-శ్రీలంక, ఛండీఘర్, 1990
83-ఆస్ట్రేలియా, మెల్బోర్న్, 1981
84-దక్షిణాప్రికా, జోహన్నెస్ బర్గ్, 2006
91-బంగ్లాదేశ్, ఢాకా, 2000
93-ఆస్ట్రేలియా, ముంబై, 2004
94-న్యూజిలాండ్, హామిల్టన్, 2002
100-న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 1981
101-ఇంగ్లాండ్, లండన్, ఓవల్ 1971
101-న్యూజిలాండ్, అక్లాండ్, 1968
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications