Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2 రోజుల్లో 36 వికెట్లా? ఇదో చెత్త పిచ్.. ఆసీస్ కెప్టెన్ ఆగ్రహం!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత నాలుగో టెస్ట్‌లో గెలుపొందింది. మెల్‌బోర్న్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది.

పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు కుప్పకూలగా.. రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. చెత్త పిచ్ కారణంగానే ఓటమిపాలయ్యామని పరోక్షంగా వెల్లడించాడు. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడటం మరీ దారుణమని అభిప్రాయపడ్డాడు.

ఇదో చెత్త పిచ్..

'ఇదొక క్లిష్టమైన మ్యాచ్. చాలా త్వరగా ముగిసింది. మేం 50 నుంచి 60 పరుగులు అదనంగా చేసి ఉంటే.. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఉండేవాళ్లం. ఫలితం కూడా మాకు అనుకూలంగా ఉండేది. ఈ ఉదయం ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి బంతి ఆకారాన్ని దెబ్బతీసారు. ఈ పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించింది.

ఇంగ్లండ్ బ్యాటర్ల భారీ షాట్ల కారణంగా బంతి సీమ్ దెబ్బతిన్నది. ఈ పిచ్ ఏకపక్షంగా బౌలర్లకు అనుకూలించింది. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడటం అంటే చాలా ఎక్కువ. పిచ్‌పై గడ్డిని కొంచెం తగ్గించినా, తయారీలో చిన్న మార్పులు చేసినా బాగుండేది. కానీ పరిస్థితులు పూర్తిగా బౌలింగ్‌‌కు అనుకూలంగా ఉన్నాయి. మేం వాటికి తగ్గట్టుగానే ఆడాల్సి వచ్చింది.'అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.

36 Wickets in Two Days Is Too Much Steve Smith Blames Melbourne Pitch for Boxing Day Test Defeat

జాకోబ్, డకెట్ దూకుడు..

175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసి గెలుపొందింది. జాకోబ్ బెతెల్(46 బంతుల్లో 5 ఫోర్లతో 40), బెన్ డకెట్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), జాక్ క్రాలీ(48 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు.

అంతకుముందు 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 4 ఫోర్లతో 46), స్టీవ్ స్మిత్(24 నాటౌట్), కామెరూన్ గ్రీన్(19) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(4/34) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్(3/24) మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్‌కు(2/44) రెండు వికెట్లు దక్కగా.. గస్ అట్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఆసీస్ 152.. ఇంగ్లండ్ 110

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 29.5 ఓవర్లలో 110 పరుగులకు కుప్పకూలింది.

Story first published: Saturday, December 27, 2025, 13:32 [IST]
Other articles published on Dec 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+