Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ ఆడుతూ.. యువకుడి దుర్మరణం

34-year-old dies of heart attack while playing cricket

శ్రీకాకుళం: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బత్తుల నీలకంఠం (34) మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఇంటి సమీపంలోని మైదానంలో స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతని మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న నీలకంఠంకు ఆరేళ్ల కిందట వివాహమైంది. ఉగాదికి తల్లిదండ్రుల వద్దకు వచ్చిన అతను లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండిపోయాడు. అతడి భార్య శిల్ప హైదరాబాద్‌లోనే ఉండడంతో ఆమె లేకుండానే నీలకంఠం అంత్యక్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్న నీలకంఠానికి ఆరేళ్ల క్రితం కోల్‌కతాకు చెందిన శిల్పతో వివాహమైంది.

Story first published: Wednesday, May 6, 2020, 10:24 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+