బాల్ ఆఫ్ ది సెంచరీ..
కెరీర్ ప్రారంభంలో షేన్ వార్న్ వేసిన ఓ అత్యుత్తమ బంతి అతన్ని ప్రపంచానికి పరిచేయం చేసింది. 1993లో ప్రతిష్టాత్మక యాషెస్ టూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 34 వికెట్లు తీసిన వార్న్ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచి యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అదే సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలోనే బాల్ ఆఫ్ ది సెంచరీగా మిగిలిపోయింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో వార్న్ వేసిన ఔట్ సైడ్ లెగ్ స్టంప్ బాల్ అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టేసింది. ఇప్పటికీ ఈ వీడియో క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులును ఆశ్చర్యపరుస్తది. అందుకే వార్న్ వేసిన ఆ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.
మ్యాజికల్ బాల్-ఆండ్రూ స్ట్రాస్
2005 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ ఆండ్రూ స్ట్రాస్‌ను షేన్ వార్న్ ఔట్ చేసిన తీరు కూడా చరిత్రలో నిలిచిపోయింది. వార్న్ మ్యాజికల్ బాల్‌గా గుర్తింపు పొందింది. దాదాపూ 90 డిగ్రీలు టర్న్ అయిన బంతి బ్యాట్స్‌మన్ ఆండ్రూ స్ట్రాస్‌తో పాటు యావత్ క్రికెట్ ప్రేమికులను అవాక్కయ్యేలా చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వార్న్ వేసిన లెగ్ స్టంప్ బాల్ అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. ఈ బంతికి స్ట్రాస్ పిచ్చోడయ్యాడు. ఇలాంటి బంతులను మళ్లీ మళ్లీ చూడలేం. అది వార్న్‌కు మాత్రమే సాధ్యమైంది.
మ్యాజికల్ బాల్.. చంద్రపాల్
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ చంద్రపాల్‌ను సైతం షేన్ వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రకెక్కింది. లెగ్ స్టంప్ బాల్ అనూహ్యంగా టర్న్ అయి అతని మిడిల్ వికెట్‌ను ఎగరగొట్టేసింది. అసలు ఆ బంతి అలా ఎలా టర్న్ అయిందో అర్థం కాక బ్యాట్స్‌మన్ బిత్తరపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటుంది.


Click it and Unblock the Notifications












