Wednesday ధమాకా.. ఒకే రోజు మూడు మ్యాచ్‌లు!
భారత క్రికెట్ చరిత్రలోనే ఈ బుధవారం(జూన్ 17) ప్రత్యేకంగా నిలవనుంది. భారత అభిమానులంతా దాదాపు 12 గంటల పాటు క్రికెట్‌లో మునిగి తేలబోతున్నారు. ఎందుకంటే ఈ బుధవారం భారత జట్లు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. టీమిండియా సీనియర్ టీమ్, భారత్-ఏ జట్టు, మహిళా క్రికెటర్లు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడనున్నారు. సీనియర్, జూనియర్ టీమ్స్ వన్డే ఫార్మాట్ ఆడనుండగా.. అమ్మాయిలు టీ20 బరిలోకి దిగనున్నారు.
భారత్ ఏ X శ్రీలంక ఏ
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు భారత్-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లు తలపడనున్నాయి. తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో గెలిస్తేనే ఈ సిరీస్ ఫైనల్‌కు తిలక్ సేన అర్హత సాధిస్తోంది. లేదంటే ఇంటిబాట పడుతోంది. వైభవ్ సూర్యవంశీ ఆడుతుండటం ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణ.

గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా గత మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు అతనితో కయ్యానికి దిగారు. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో చెలరేగేందుకు వైభవ్ ప్రయత్నించే అవకాశం ఉంది. అదే జరిగితే అభిమానులకు పండుగే. ఈ మ్యాచ్ సోనీ టీవీతో పాటు సోనీ లైవ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత్ X అఫ్గాన్..
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా రెండో వన్డే ఆడనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
గత మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే గత మ్యాచ్‌లో మణికట్టు గాయంతో ఇబ్బంది పడిన రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నెదర్లాండ్స్‌తో హర్మన్‌సేన ఢీ
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా రాత్రి 7 గంటలకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. అదే జోరులో నెదర్లాండ్స్‌పై విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికాతో కీలకమైన మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. బుధవారం భారత క్రికెట్ అభిమానులకు తీన్మార్ థ్రిల్లింగ్ లభించనుంది. ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

