For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఆ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కోసం ఫ్రాంచైజీల పోటీ.. వేలంలో రికార్డు ధర పలికే చాన్స్!

3 Teams That Can Target England’s Dawid Malan In IPL 2021 Auction can make him the richest IPL player
IPL 2021 Auction : 1097 Players Register for Auction - Joe Root, Mitchell Starc out

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ కోసం ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలన్.. గత కొంతకాలంగా తన ఆటతో దూకుడుకు మారు పేరుగా నిలుస్తున్నాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో అండగా ఉంటున్న డేవిడ్, గతేడాది క్రికెట్ లీగ్స్‌లో హాట్ ఫేవరేట్‌గా నిలిచాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)‌లో హోబట్ హారికెన్స్ తరఫున ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్.. ఈసారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. చెన్నైలో ఈ నెల 18న నిర్వహించే ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

 పోటీలో మూడు ఫ్రాంచైజీలు..

పోటీలో మూడు ఫ్రాంచైజీలు..

ఐపీఎల్ 2020 సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు సరైన ఆటగాళ్లు లేక ఇబ్బందులు పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నెంబర్ 3 స్థానానికి సరైన బ్యాట్స్‌మన్ లేక సతమతమయ్యాయి. శనివారం ముగిసిన బీబీఎల్ సీజన్‌లో మలన్ నిరాశాజనకమైన ప్రదర్శన చేశాడు.

కానీ అతని ఐసీసీ ర్యాంకింగ్, గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో దూకుడు పరిశీలించిన పలు ఫ్రాంచైజీలు ఈ సీజన్‌లో మలన్ జట్టులో ఉంటే బ్యాటింగ్‌లో బలం పెరుగుతుందని భావిస్తున్నాయి. బీబీఎల్ 2021లో 10 మ్యాచ్‌లు ఆడిన మలన్ 265 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 75 మాత్రమే. అయినా సరే మలన్ కోసం ఆ మూడు ఫ్రాంచైజీలతో పాటు ఇతరులు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు

బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు

ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలన్ బేస్‌ప్రైజ్ రూ. 1.5 కోట్లతో అందుబాటులో ఉన్నాడు. అయితే ఈసారి వేలంలో ఇతని కోసం పోటీ గట్టిగా ఉండటంతో రికార్డు ధరకు అమ్ముడుపోతాడని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అత్యధిక ధర పొందిన పాట్ కమిన్స్(రూ.15.5 కోట్లు), బెన్ స్టోక్స్(రూ. 14.5 కోట్లు) గ్లేన్ మ్యాక్స్ వెల్(రూ.10.5 కోట్లు), క్రిస్ మోరీస్(రూ.10 కోట్లు)ధరను ఈసారి డేవిడ్ మలన్ అధిగమించే అవకాశం ఉన్నది.

ఆలస్యంగా వచ్చినా..

ఆలస్యంగా వచ్చినా..

లండన్‌లో పుట్టి సౌతాఫ్రికాలో పెరిగిన డేవిడ్ మలన్ తండ్రి, సోదురుడు కూడా ఫస్ట్ క్లాస్ ఆడిన క్రికెటర్లే. 2006లో మిడిల్ సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన డేవిడ్.. 2019 నుంచి యార్క్ షైర్ తరఫున ఆడుతున్నాడు. మిడిల్ సెక్స్ కౌంటీ జట్టుకు మూడు ఫార్మాట్లలో మలన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఎన్నో ఏళ్లుగా కౌంటీ క్రికెట్‌లో రాణిస్తున్నా మలన్ చాలా ఆసల్యంగా ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్‌గా ఎదిగాడు.

వేలంలో 1097 మంది..

వేలంలో 1097 మంది..

ఈ నెల 18న చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు 1097 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి అత్యధికంగా 56 ఎంట్రీలు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా తమ జట్టులోకి 25 మంది ఆటగాళ్లను తీసుకుంటే వేలంలోకి 61 మందిని తీసుకుంటామని ఐపీఎల్ తెలిపింది. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. 18న మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.

Story first published: Monday, February 8, 2021, 14:43 [IST]
Other articles published on Feb 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+