Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: పాకిస్థాన్‌పై భారత్ గెలవాలంటే.. ఈ మూడు వ్యూహాలు అమలు చేయాల్సిందే!

3 Strategies India Needs To Follow To Win On Pakistan In Asia Cup 2022

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ X పాకిస్థాన్ మెగా పోరుకు సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో ఆసియాకప్ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. దాయాదీల పోరు కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పోరును ఆటలా కాకుండా ఇరు దేశాల అభిమానులు యుద్దంలా భావిస్తారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దాంతో ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను ఐసీసీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఆ క్రమంలోనే ఫస్ట్‌ మ్యాచ్‌లోనే ఇరు దేశాలు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. పాక్ మాత్రం అదే జోరును కొనసాగించి ఊహించని షాకివ్వాలనుకుంటుంది.

ఓపెనర్‌గా సూర్యకుమార్ యాదవ్

ఓపెనర్‌గా సూర్యకుమార్ యాదవ్

రోహిత్ శర్మకు జతగా సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. వెస్టిండీస్ పర్యటనలో అతను ఓపెనర్‌గా సత్తా చాటాడు. ధాటిగా ఆడే సూర్య.. ఏబీడీలా మైదానం నలువైపులా షాట్లు ఆడగలడు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫీల్డ్ నిబంధనలను ఉపయోగించుకొని వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. పైగా టీమ్ సైతం దూకుడునే మంత్రంగా జపిస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్‌కు ఓపెనర్‌గా సూర్య సరిపోతాడు. రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే జట్టుకు నష్టం చేకూరనుంది. రాహుల్, రోహిత్ ఇద్దరూ ఓకే తరహా శైలి కలిగిన బ్యాటర్లు. క్రీజులోసెట్ అయ్యేవరకు సమయం తీసుకొని ఆ తర్వాత చెలరేగుతారు. ఇద్దరూ నెమ్మదిగా ఆడితే ఒత్తిడి పెరిగి వికెట్ పారేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించైనా.. సూర్యను ఓపెనర్‌గా బరిలోకి దించాలి.

దీపక్ ‌హుడాకు అవకాశం ఇవ్వాలి..

దీపక్ ‌హుడాకు అవకాశం ఇవ్వాలి..

టీమిండియాకు దీపక్ హుడా లక్కీ చార్మ్‌గా మారాడు. ఇప్పటి వరకు అతను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. ఇప్పటి వరకు అతను టీమిండియా తరఫున అతను 17 మ్యాచ్‌లు ఆడగా.. ఈ 17 మ్యాచ్‌ల్లో విజయం దక్కడం గమనార్హం. అంతేకాకుండా హుడా జట్టులోకి వస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ బలం పెరుగుతోంది. ఫీల్డింగ్‌లో కూడా హుడా సత్తా చాటగలడు. హుడా కారణంగా భారత్‌కు 6వ బౌలింగ్ ఆప్షన్ లభించనుంది. నాలుగో స్థానానికి హుడా సరిగ్గా సరిపోతాడు. గాయం నుంచి కోలుకొని జింబాబ్వే పర్యటనలో ఆడిన కేఎల్ రాహుల్ మునపటిలా రాణించలేకపోయాడు. కాబట్టి అతన్ని పక్కనపెట్టి దీపక్ హుడాను ఆడించే ప్రయత్నం చేయాలి.

 ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌..

ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌..

టీమిండియా ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాలి. నెంబర్ 7లో కార్తీక్ బ్యాటింగ్‌కు రావడం చాలా ముఖ్యం. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాలన్నా.. లక్ష్యచేధనలో చివర్లో మెరుపులు మెరిపించాలన్నా దినేశ్ కార్తీక్ చివర్లో ఇచ్చే ఫినిషింగ్ టచ్ చాలా ముఖ్యం. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించగలిగే సత్తా అతనిది. గత కొన్ని రోజులుగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వచ్చు.

Story first published: Tuesday, August 23, 2022, 14:57 [IST]
Other articles published on Aug 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+