
బౌలర్ల కెప్టెన్‌గా
2014 ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ ఈ ఫార్మాట్‌లో భారత ఆట తీరునే మార్చేశాడు. ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీతో టీమ్ మైండ్ సెట్‌నే మార్చేశాడు. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే అంటూ బౌలర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి రిజల్ట్ తెచ్చాడు. బ్యాటర్లు, స్పిన్నర్లను మాత్రమే నమ్ముకున్న కెప్టెన్లు భారత్‌లోనే సక్సెస్ అయితే.. పవర్‌ఫుల్ పేస్ అటాక్‌ను తయారు చేసుకొని.. ఫారిన్‌లోనూ విరాట్ సక్సెస్ అయ్యాడు. షమీ, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా, సిరాజ్, శార్దూల్‌లతో భారత పేస్ ఎటాక్‌ను వరల్డ్ బెస్ట్‌గా మార్చాడు. అలాగే, రవిశాస్త్రి సూచనతో టెస్టుల్లో రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి అతని టెస్ట్ కెరీర్‌ను మళ్లీ నిలబెట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన ఘనతలన్నీ నాణానికి ఓవైపు అయితే.. మరోవైపు వైఫల్యాలు కూడా ఉన్నాయి.

బ్యాటింగ్ బలహీనంగా..
ది బెస్ట్ పేస్ అటాక్‌గా మార్చిన కోహ్లీ.. బ్యాటింగ్‌ను మాత్రం బలహీనం చేశాడనే ఆరోపణలున్నాయి. ఐసీసీ టోర్నీలు గెలవకపోవడం కూడా అతని కెప్టెన్సీ కెరీర్‌లో మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లను వెనకేసుకురావడం వల్ల యువ ఆటగాళ్లకు తీరని అన్యాయం చేసిన కెప్టెన్‌గా కూడా కోహ్లీ ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలను పదేపదే వెనకేసుకురావడం, వ్యక్తిగతంగా గత రెండుళ్లుగా కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో బ్యాటింగ్ పూర్తిగా బలహీనమైంది. వాస్తవానికి ఈ మధ్య కాలంలో భారత్ సాధించిన విజయాల్లో లోయారార్డర్ రాణించడం వల్లే అని చెప్పడంలో సందేహమే లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై టెయిలండర్లు విలువైన భాగస్వామ్యాలు అందించారు.

ఒక్క ఐసీసీ టైటిల్ లేదు..
ఏడేళ్ల విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఖంగుతిన్న టీమిండియా.. వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ దెబ్బకు సెమీస్‌కే పరిమితమైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ఓడింది. ఇక 2021 టీ ప్రపంచకప్‌లో అయితే కనీసం లీగ్ స్టేజ్ కూడా ధాటలేకపోయింది. ఈ ఓటములు విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశ్నించాయి.

యువ ఆటగాళ్లకు చోటివ్వకుండా..
ఇక సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలివ్వడంతో యువ ఆటగాళ్లు బెంచ్‌పైనే నిరీక్షించాల్సి వచ్చింది. మహమ్మద్ సిరాజ్‌ను స్టార్ పేసర్‌గా తీర్చిదిద్దిన విరాట్ కోహ్లీ.. బ్యాట్స్‌మన్‌గా ఒక్క యువ ఆటగాడికి చోటివ్వలేకపోయాడు. మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ మినహా బ్యాట్స్‌మెన్ అంతా దాదాపు ధోనీ సారథ్యంలో వచ్చిన వాళ్లే. సీనియర్ ఆటగాళ్లకు గాయాలైతేనే జట్టులోకి రావడం సత్తా చాటడం.. మళ్లీ బెంచ్‌పై కూర్చోవడం పరిపాటైంది.


Click it and Unblock the Notifications
