Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ వారసుడు అతనే.. కానీ ఆ ముగ్గురితో పోటీ!

టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు గుడ్‌బై చెప్పారు. వారి స్థానాల్లో సత్తా చాటేందుకు కుర్రాళ్లు సిద్దంగా ఉన్నా.. జట్టును నడిపించే సారథి ఎవరా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన వెంటనే టీ20 సారథ్య బాధ్యతలను స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సిద్దమవ్వగా.. హార్దిక్ సారథ్యంలోని యంగ్ టీ20 టీ20 సిరీస్‌లు ఆడింది. కానీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో ఈ ప్రణాళిక అంతా తారుమారైంది. మరోవైపు హార్దిక్ పాండ్యా చీల మండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.

3 Players Who Can Replace Rohit Sharma As Captain after his retirement

తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్‌కు సన్నదమైన టీమిండియా.. హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో రోహిత్ శర్మనే సారథిగా కొనసాగించింది. మరోవైపు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలతో పాటు పేలవ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ ఆడటమే అనుమానంగా మారింది. కానీ అతను అన్నీ ప్రతికూలతలను ధాటి జట్టులోకి వచ్చాడు. బ్యాట్‌తో పాటు బంతితో అసాధారణ ప్రద్శన కనబర్చి జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా.. రోహిత్ వారసత్వాన్ని అందుకునేందుకు ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా సైతం హార్దిక్ పాండ్యానే తమ తదుపరి కెప్టెన్ అనే సంకేతాలు కూడా ఇచ్చాడు. అయితే హార్దిక్ పాండ్యాకు పోటీగా ముగ్గురు ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉన్నారు.

3 Players Who Can Replace Rohit Sharma As Captain after his retirement

ఆ ముగ్గురితో పోటీ..
ఇందులో వరల్డ్ బెస్ట్ పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రా ఒకరు కాగా.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరొకరు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మూడోవాడు. టీ20 సారథ్య బాధ్యతలను అప్పగించేందుకు సెలెక్టర్లు ఈ ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐర్లాండ్ పర్యటనలో బుమ్రా.. భారత జట్టును నడిపించగా.. సౌతాఫ్రికా పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు సారథ్యం వహించాడు.

శుభ్‌మన్ గిల్ అప్‌కమింగ్ జింబాబ్వే పర్యటనలో భారత జట్టును నడిపించబోతున్నాడు. మూడు ఫార్మాట్లలో కీలక పేసర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ అదనపు ఒత్తిడిగా మారే అవకాశం ఉంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుత ప్రదర్శన కనిపిస్తున్నాడు. రెండు ఫార్మాట్లలో ఆసీస్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. సూర్య, శుభ్‌మన్‌ గిల్‌లకు కెప్టెన్సీ చేసిన అనుభవం పెద్దగా లేదు.

3 Players Who Can Replace Rohit Sharma As Captain after his retirement

ఫిట్‌నెస్‌పైనే భవితవ్యం..
ఈ క్రమంలోనే ఈ ముగ్గురి కంటే హార్దిక్ పాండ్యాకే కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్‌ను అతను అద్భుతంగా నడిపించాడు. కాకపోతే అతను ఫిట్‌‌గా ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌గా ప్రతీ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి హార్దిక్ ఫిట్‌నెస్‌పైనే అతని కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉంది.

Story first published: Wednesday, July 3, 2024, 11:30 [IST]
Other articles published on Jul 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+