వరుస గాయాలు.. టీ20 ప్రపంచకప్‌కు ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు దూరం!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. మరో మూడు నెలల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆయా జట్లు మెగా టోర్నీ నేపథ్యంలో కసరత్తులు ప్రారంభించాయి. టీమ్ కాంబినేషన్‌పై దృష్టి సారించాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కూడా టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా సిద్దమవుతోంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచంలో దారుణంగా విఫలమైన టీమిండియా.. ఈ సారి ఆ తప్పిదం చేయకుండా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. గత 9 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలనుకుంటుంది. అయితే ఆటగాళ్ల గాయాలు జట్టును కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ముగ్గురు స్టార్ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేఎల్ రాహుల్..
ఇటీవలనే హెర్నియా ఆపరేషన్ చేసుకున్న కేఎల్ రాహుల్ అంతలోనే కరోనా బారిన పడ్డాడు. దాంతో వెస్టిండీస్ పర్యటనలోని టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. భారత జట్టులో కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సత్తా చాటాడు. అయితే గత కొన్ని రోజులుగా అతను వరుసగా గాయపడుతున్నాడు. దాంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు జట్టుకు దూరమైన రాహుల్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా దూరమయ్యాడు. హెర్నియా ఆపరేషన్ అనంతరం కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాహుల్.. ఫిట్‌నెస్ టెస్ట్‌కు ముందు కరోనా బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతను ఆడటంపై సందేహం నెలకొంది.

భువనేశ్వర్ కుమార్
స్వింగ్ కింగ్ అయిన భువనేశ్వర్ కుమార్ సైతం టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో భువీ వైఫల్యం జట్టు కొంపముంచింది. పూర్తిగా ఫిట్‌నెస్ లేకుండానే భువీని ఎంపిక చేసారనే విమర్శలు వచ్చాయి. అయితే టీ20 ప్రపంచకప్ అనంతరం భువీ తీవ్ర కసరత్తులు చేసి ఫిట్‌నెస్ సాధించాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్న భువీ.. ఇటీవల ముగిసిన సిరీస్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే అతను ఇదే జోరు కొనసాగిస్తాడా? అనేది సందేహంగా మారింది. ఫిట్‌నెస్‌పై కూడా సందేహాలున్నాయి. ఈ క్రమంలోనే భువీ సైతం అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ ఆడటం డౌటే అనిపిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్..
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీతో చెలరేగి సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సైతం ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదిలో రెండు సార్లు అతను గాయపడ్డాడు. కుడి చేతిలో వెంట్రుక మందం ఫ్రాక్చర్ రావడంతో శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన సూర్య.. ఆ తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీలో కూడా ఫిట్‌నెస్ సమస్యలతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం ఎడమ చేతి మజిల్‌కు గాయమవ్వడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో మళ్లీ బరిలోకి దిగిన సూర్య.. మరోసారి గాయపడితే టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications