Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహ్మద్ షమీ వైఫ్ హసీన్ జహాన్‌ను వేధించిన వ్యక్తి అరెస్ట్.. పనిమనిషి కొడుకే నిందితుడు!

 25-year-old man arrested for threatening Mohammed Shami’s wife Hasin Jahan

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ సతీమణి హసీన్ జహాన్‌ను తరూచూ ఫోన్ కాల్స్‌ బెదిరింపులతో వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా చెందిన 25 ఏళ్ల వ్యక్తి జహాన్‌కు తరచు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ.. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశాడు. దీనిపై గతంలోనే పోలీసులకు జహాన్‌ ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి పనిమినిషే..

ఇంటి పనిమినిషే..

‘తొలుత జహాన్ ఇంట్లో పనిచేసి మానేసిన ఓ మహిళ ఆమెకు కాల్స్ చేస్తూ వేధించింది. ఆ తర్వాత ఆమె కొడుకు వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో జహాన్‌ పోలీసులను ఆశ్రయించింది. భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకుంటే వ్యక్తిగత ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేశాడు. ఫోన్‌ చేసిన ప్రతీసారి ఆమెను తిట్టేవాడు. ఆ కాల్స్‌ను ఎత్తకపోతే ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్‌ చేశాం. జహాన్ పని మనిషి కోసం వెతుకుతున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది' అని ఓ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు.

 షమీపై సంచలన ఆరోపణలు..

షమీపై సంచలన ఆరోపణలు..

ఇక మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, అతనికి అనేక మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతన్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు.

 ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ..

ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ..

ఇక మోడల్ అయిన జహాన్ తరుచూ సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతూ ఉంటుంది. వారి చేతిలో తీవ్ర ట్రోలింగ్ గురవుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ట్రోలర్స్ నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఆమె అలవాటే. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టును కూడా ఆశ్రయించింది. ప్రస్తుతం తన మోడల్ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె ఈ మధ్య సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం షమీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. జహాన్ ఆరోపణలతో ఆత్మహత్య చేసుకోలానుకున్నట్లు కూడా షమీ పలు ఇంటర్వ్యూల్లో తెలిపాడు. ఈ సమస్యలన్నిటినీ అధిగమించిన అతను అద్భుత బౌలింగ్‌తో జట్టులో కీలకమయ్యాడు.

Story first published: Thursday, November 26, 2020, 15:55 [IST]
Other articles published on Nov 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+