Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు హీరోయిన్‌తో యశస్వి జైస్వాల్ డేటింగ్..?

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌ఛల్ చేస్తోంది. ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మృణాల్ ఠాకూర్‌‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వెలువడటం చర్చనీయాంశమైంది. తన కంటే 9 ఏళ్లు పెద్దది అయిన మృణాల్ ఠాకూర్‌తో యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

IND vs ZIM: జింబాబ్వే క్లీన్ స్వీప్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి ట్రోఫీ కైవసం!

IND vs ZIM: జింబాబ్వే క్లీన్ స్వీప్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి ట్రోఫీ కైవసం!

ఈ ఇద్దరూ ముంబైలోని ఓ ప్రముఖ కేఫ్‌కు వెళ్లడమే ఈ పుకార్లకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముందుగా మృణాల్ ఠాకూర్ ఆ కేఫ్‌లోకి వెళ్లగా.. కొంత సమయం తర్వాత అదే కేఫ్ నుంచి యశస్వి జైస్వాల్ బయటకు వచ్చినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ రెండు విషయాలను ముడిపెడుతూ.. డేటింగ్ అంటూ పుకార్లకు తెరలేపారు. ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కేఫ్‌లో గడిపారని, ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలను సృష్టించారు.

24-Year-Old Cricketer Yashasvi Jaiswal Dating 33-Year-Old Mrunal Thakur Viral Video From Mumbai Sparks Buzz

మరికొందరు ఈ వాదనను తప్పుబడుతున్నారు. యశస్వి జైస్వాల్.. మృణాల్ ఠాకూర్‌కు తమ్ముడిలాంటి వాడని, ఈ ఇద్దరి మధ్య 9 ఏళ్ల వ్యత్యాసం ఉందని మండిపడుతున్నారు. ఒకే కేఫ్‌లో కనిపించినంత మాత్రానా ప్రేమలో ఉన్నట్లా? అని ప్రశ్నిస్తున్నారు. వారు ఏదైనా ప్రమోషనల్ యాడ్స్‌లో నటించేందుకు కలుసుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు.

వారి వ్యక్తిగత జీవితాలు ప్రభావితమయ్యేలా అనవసర ఊహాగానాలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఈ డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ స్పందించలేదు.

ఆ ఇద్దరి కోసం యశస్వి జైస్వాల్‌‌ను తప్పిస్తారా? సంజయ్ మంజ్రేకర్ ఫైర్!

ఆ ఇద్దరి కోసం యశస్వి జైస్వాల్‌‌ను తప్పిస్తారా? సంజయ్ మంజ్రేకర్ ఫైర్!

మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో తమిళ హీరో ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలను మృణాల్ ఠాకూర్ సన్నిహితులు ఖండించారు. మరోవైపు బ్రిటన్‌కు చెందిన మ్యాడీ హామిల్టన్‌తో యశస్వి జైస్వాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది.

Story first published: Monday, July 27, 2026, 19:00 [IST]
Other articles published on Jul 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+