Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యో దేవుడా.. ఇదేం అంపైరింగ్‌ సామీ!! బంతి బ్యాట్‌కు‌ తాకినా!

2 biggest umpiring mistakes in BBL 2020-21

హైదరాబాద్: క్రికెట్‌ ఆటలో అంపైరింగ్‌ తప్పిదాలు సహజమే. అయితే చిన్నచిన్న తప్పిదాలను ఆటలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అంపైరింగ్‌ చేయడం కష్టతరమే అయినా.. కళ్లకు కట్టినట్లు కనిపించే వాటిని కూడా తప్పుగా ప్రకటించడం ఇప్ప్పుడు చర్చనీయాంశం అయింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిఏటా నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌లో అంపైర్ల తప్పిదాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఎంతలా అంటే అంపైర్ల తప్పిదాలు ఆటగాళ్లకు, క్రికెట్‌ అభిమానులకు విసుగు పుట్టిస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ తప్పిదాలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు అంపైర్లు.

బ్యాట్‌కు తాకి ప్యాడ్లకు తాకినా

బ్యాట్‌కు తాకి ప్యాడ్లకు తాకినా

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ కూపర్ ‌ఆడిన ఓ బంతిని అంపైర్‌ టోనీ వైల్డ్స్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లకు తాకినా.. అతడు ఔటివ్వడం వివాదాస్పదంగా మారింది. డానీబ్రిగ్స్‌ వేసిన 11.2 బంతిని కూపర్‌ రివర్స్‌స్వీప్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత ప్యాడ్‌కు తగిలింది. బౌలర్‌ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. రీప్లేలో ఆ బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

బ్యాట్‌ను తాకుతూ

అంతకుముందు రోజు మరో అంపైర్‌ తప్పుడు నిర్ణయం ప్రకటించాడు. పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా ఆడిన ఓ బంతి నేరుగా వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తాకిన శబ్దం కూడా చాలా స్పష్టంగా వినిపించింది. ఆండ్రూ టై వేసిన ఆ బంతి ఖవాజా బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలోనూ కనిపించింది. అయితే అంపైర్‌ సైమన్‌ లైట్‌బాడీ దాన్ని నాటౌట్‌గా ఇచ్చాడు. ఈ నిర్ణయం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా టై ఆశ్చర్యానికి గురయ్యాడు. అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఓ మై గాడ్.. ఇదెలా ఔట్

ఈ రెండు తప్పులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఓ మై గాడ్.. ఇదెలా ఔట్ ఇచ్చాడు' అని బ్రిస్బేన్ హీట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనగా.. 'డియర్ ఉస్మాన్‌ ఖవాజా.. ఇది పద్ధతి కాదు' అని క్రికెట్ వీడియోస్ ఆ రెండు వీడియోలకు కాప్షన్ ఇచ్చాయి. ఈ రెండు తప్పులపైన ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. 'అయ్యో దేవుడా'.. 'ఇదేం అంపైరింగ్‌ సామీ' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక స్పిన్‌ దిగ్గజం షేన్ ‌వార్న్‌ సైతం వీటిపై అసహనం వ్యక్తం చేశాడు. బిగ్‌బాష్‌ టోర్నీ మెరుగ్గా నిర్వహించాలంటే.. డీఆర్‌ఎస్‌ అమలు చేయాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సూచించాడు.

బాక్సింగ్‌డే టెస్టుకు టీంను ప్రకటించిన భారత్.. రాహుల్‌కు షాక్!! తుది జట్టులో ఇద్దరు తెలుగోళ్లు!

Story first published: Friday, December 25, 2020, 14:24 [IST]
Other articles published on Dec 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+