బాక్సింగ్‌డే టెస్టుకు టీంను ప్రకటించిన భారత్.. రాహుల్‌కు షాక్!! తుది జట్టులో ఇద్దరు తెలుగోళ్లు!

మెల్‌బోర్న్: ఆతిథ్య ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయం చవిచూసిన భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు రేపటి (డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. సొంతగడ్డపై రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ సై అంటుంటే.. ఎన్నో ప్రతికూలతల మధ్య భారత్ బరిలోకి దిగుతోంది. అయితే శనివారం ప్రారంభం కానున్న బాక్సింగ్‌డే టెస్టుకు భారత్ టీంను ప్రకటించింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానే అందుకున్నాడు. తుది జట్టును ఓసారి పరిశిలిస్తే...

షా అవుట్.. గిల్ ఇన్
బాక్సింగ్ డే టెస్టుకు ఒకరోజే ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన పృథ్వీ షాను జట్టు మేనేజ్‌మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి వచ్చాడు. గిల్ సన్నాహక పోరులో చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మయాంక్ అగర్వాల్‌కు తోడుగా గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. అయితే అగర్వాల్ ఫామ్‌ను అందుకోవాల్సివుంది. ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే టీమిండియాకు తిరుగుండదు.

షమీ స్థానంలో సిరాజ్
మొదటి మ్యాచ్‌లో కీపర్‌గా విఫలమైన వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. కచ్చితంగా చోటు దక్కుతుందనుకున్న కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశే మిగిలింది. మొదటిటెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో రెండో టెస్టుకు ఎంపిక చేశారు. తెలుగు ఆటగాడు హనుమ విహారిపై టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. రెండో టెస్టులో ఇద్దరు (విహారి, సిరాజ్) తెలుగు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
స్పిన్నర్ స్థానంలో అశ్విన్
వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ చేయనున్నాడు. ఆపై అజింక్యా రహానే, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఆరులో రిషబ్ పంత్, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజాలు బ్యాటింగ్ చేస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్.. పేస్ బౌలర్ల కోటాలో ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది.

తుది జట్టు
అజింక్యా రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications