Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచినే స్ఫూర్తి: అరంగేట్రంపై బేబీ బాయ్‌కాట్ తండ్రి

రాజ్ కోట్: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ హబీబ్ హమీద్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. [రాజ్‌కోట్ టెస్టుతో అరంగేట్రం: ఎవరీ హబీబ్ హమీద్]

భారత్ సంతతికి చెందిన ఈ క్రికెటర్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్‌లో తొలిసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను చూశాడట. తన కుమారుడు తొలుత సచిన్ గురించిన అడిగన సందర్భంలో అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని తాను చెప్పినట్లు ఆయన తెలిపాడు.

ఆరోజు సచిన్ గురించి తెలుసుకున్న హమీద్ తాను కూడా ఏదో ఒకరోజు ఇంగ్లాండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. అందరిలాగే తన కుమారుడు కూడా ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్‌గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనయ్యానని హమీద్ తండ్రి పేర్కొన్నాడు.

మనసులో ఆందోళన తగ్గలేదు

మనసులో ఆందోళన తగ్గలేదు

క్రీజులోకి వెళ్లిన తన కుమారుడు కొంతసేపటి తర్వాత కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదని వెల్లడించాడు. ఇంగ్లాండ్ తరుపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడు హబీబ్ హమీదే కావడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఐదో పిన్న వయస్కుడు. ప్రస్తుతం హబీబ్ హమీద్ వయసు 19 ఏళ్ల 297 రోజులు.

ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిపోయిన హమీద్ కుటుంబం

ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిపోయిన హమీద్ కుటుంబం

కాగా, గుజరాత్‌కు చెందిన హమీద్ కుటుంబం ఎప్పుడో భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిపోయి అక్కడ పౌరసత్వాన్ని పొందింది. తన కుమారుడిని క్రికెటర్‌గా చూడాలని హమీద్ తండ్రి ఇస్మాయిల్ కోరిక మేరకు అతడిని ఆ దిశగా నడిపించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లోని కౌంటీల్లో అనేక మ్యాచ్‌లు ఆడిన హమీద్ ఈ సీజన్‌లో లాంక్ షైర్ తరపున ఆడి సత్తా చాటాడు.

ముద్దు పేరు 'బేబీ బాయ్‌కాట్' అలా వచ్చింది

ముద్దు పేరు 'బేబీ బాయ్‌కాట్' అలా వచ్చింది

16 మ్యాచ్‌ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్ జెఫ్రీ బాయ్‌కాట్ ఆటతీరుని హబీబ్ హమీద్ ఆటతీరు పొలి ఉండటంతో జట్టులోని సహచర ఆటగాళ్లంతా హబీబ్ హమీద్‌ను 'బేబీ బాయ్‌కాట్' పిలుస్తుంటారు.

82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు

82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. గుజరాత్‌కు చెందిన హబీబ్ హమీద్ కుటుంబం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసం ఉంటున్నారు. హబీబ్ హమీద్ సోదరుడు నుమాన్ గత వారమే రాజ్‌కోట్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+