రాజ్ కోట్: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ హబీబ్ హమీద్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
ఇంగ్లాండ్ తరుపున అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడు హబీబ్ హమీదే కావడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఐదో పిన్న వయస్కుడు. ప్రస్తుతం హబీబ్ హమీద్ వయసు 19 ఏళ్ల 297 రోజులు.
గుజరాత్‌కు చెందిన హబీబ్ హమీద్ కుటుంబం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసం ఉంటున్నారు. హబీబ్ హమీద్ సోదరుడు నుమాన్ గత వారమే రాజ్‌కోట్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లో హబీబ్ హమీద్ లాంగ్షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్ జెఫ్రీ బాయ్‌కాట్ ఆటతీరుని హబీబ్ హమీద్ ఆటతీరు పొలి ఉండటంతో జట్టులోని సహచర ఆటగాళ్లంతా హబీబ్ హమీద్‌ను 'బేబీ బాయ్‌కాట్' పిలుస్తుంటారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో హబీబ్ హమీద్ చోటు దక్కించుకున్నా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు.
దీంతో బంగ్లాదేశ్ టెస్టు సిరిస్‌లో హబీబ్ హమీద్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. హబీబ్ హమీద్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ సందర్భంగా లాంగ్షైర్ క్లబ్ హబీబ్ హమీద్‌నుద్దేశించి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
రాజ్‌కోట్ వేదిగా జరుగుతున్న తొలి టెస్టులో హబీబ్ హమీద్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా, టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు క్రికెట్‌లో చాలా రోజుల తర్వాత టీమిండియా టాస్ ఓటమి పాలైంది. కాగా, రాజ్ కోట్ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.