Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

32వ సారి కోహ్లీ: ధర్మశాల వన్డేలో నమోదైన రికార్డులివే

ధర్మశాల: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలివన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుసిరిస్‌లో న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విరాట్‌ కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగించడంతో 900వ వన్డేలో భారత్ విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది. ధర్మశాల వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు.

1st ODI in Dharamsala: Match highlights, as it happened

భారత్ Vs న్యూజిలాండ్ ధర్మశాల వన్డే చిత్రాలుకాగా, న్యూజిలాండ్ జట్టుకు భారత పర్యటన అస్సలు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. వన్డే సిరిస్‌లో రాణించే అత్యంత అద్భుతమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతమైనప్పటికీ ఆ మేరకు రాణించడం లేదు. నిజానికి ప్రత్యర్ధి జట్టుని మట్టికరిపించడంలో కివీస్ ఆటగాళ్లను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు.

అలాంటి కివీస్ జట్టుకు భారత్‌తో సిరీస్ కలసిరాలేదు. టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవ్వడంతో ఆజట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన కివీస్ జట్టు ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో పేలవమైన ఆటతీరుని కనబరిచింది. టాప్ ఆర్డర్ విఫలమైన కివీస్ జట్టులో లాంథమ్, టిమ్ సౌథీ రికార్డులను నమోదు చేశారు.

ఆడుతూ పాడుతూ: ధర్మశాల వన్డేలో భారత విజయానికి కారణాలివేధర్మశాల వన్డేలో నమోదైన రికార్డులు:

* ధర్మశాల వన్డేలో టిమ్ సౌథీ అరుదైన రికార్డుని నమోదు చేశాడు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌథీ (55;45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
* న్యూజిలాండ్ వన్డే క్రికెట్‌లో 10 లేదా 11 వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అర్థశతకం సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు.
* సౌథీ తన 100వ వన్డే ఆడుతూ తన తొలి అర్ధ సెంచరీని సాధించడం విశేషం.
* 2004లో ఆస్ట్రేలియాపై కైల్ మిల్స్ 44 (నాటౌట్) పరుగులు చేశాడు.
* వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి జట్టు ఆలౌటైనా, అజేయంగా నిలిచిన తొలి న్యూజిలాండ్‌ ఆటగాడిగా లాంథమ్ రికార్డు నెలకొల్పాడు.
* వన్డే క్రికెట్‌లో మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన పదో ఆటగాడు.
* న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ చివరి ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కావడం ఇది నాలుగోసారి. ఇక భారత్ టూర్‌లో 'సున్నా'కే వెనుదిరగడం టేలర్‌కు మూడోసారి.
* భారీ లక్ష్య ఛేదనలో భారత్ గెలిచిన మ్యాచ్‌ల్లో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి 70 ఇన్నింగ్స్‌లాడి 32 అర్ధ సెంచరీలు చేశాడు.
* క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 107 ఇన్నింగ్స్‌ల్లో 34 సెంచరీలతో మొదటిస్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+