Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడుతూ పాడుతూ: ధర్మశాల వన్డేలో భారత విజయానికి కారణాలివే

ధర్మశాల: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలివన్డేలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టుసిరిస్‌లో న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫార్మెట్ మారినా భారత్ ఇన్నింగ్స్‌లో దూకుడు మాత్రం మారలేదు. కెప్టెన్ మారినా జట్టు ఆటతీరులో ఏ మాత్రం తేడా రాలేదు. ధర్మశాలలో తొలి వన్డేలో బంతితో, బ్యాట్‌తో ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను ముప్పతిప్పలు పెట్టింది. సీనియర్లకు విశ్రాంతితో జట్టులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా 31 పరుగులిచ్చి 3 వికెట్లతో అద్భుత బౌలింగ్‌తో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

భారత్ Vs న్యూజిలాండ్ ధర్మశాల వన్డే చిత్రాలు

మరో ఆటగాడు కేదార్ జాదవ్ రెండు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విరాట్‌ కోహ్లీ తన ఫామ్‌ని కొనసాగించడంతో 900వ వన్డేలో భారత్ విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది.

900వ వన్డే భారత్‌‌దే: ధోని ఔట్, బాధపడి బ్యాట్‌ను నేలకేసి కొట్టిన కోహ్లీ

భారత బౌలర్ల అత్యంత అద్భుతమైన ప్రదర్శనకు తోడు విరాట్‌ కోహ్లీ (81 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 85 నాటౌట్‌) క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ తోడవడంతో ఆదివారం ధర్మశాలలో జరిగిన తొలి డే/నైట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది.

 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. 14 పరుగుల స్కోరువద్ద మార్టిన్ గుప్టిల్ (12)ను రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా, హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో ఆరంభమైన కివీస్ పతనం ఆరంభమైంది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్‌ను కాపాడుకుంటూ ఆడినప్పటికీ, మిగతా వారి నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తొమ్మిది బంతుల్లో కేవలం మూడు పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రాకు చిక్కాడు.

29 పరుగులకే రెండు వికెట్లు

29 పరుగులకే రెండు వికెట్లు

29 పరుగుల వద్ద రెండో వికెట్ కూలగా, మరో నాలుగు పరుగులకే మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (0) కూడా పెవిలియన్ చేరాడు. ఉమేష్ వేసిన బంతి అతని బ్యాట్ అంచులకు తగులుతూ వికెట్‌కీపింగ్ చేస్తున్న ధోనీ చేతుల్లోకి వెళ్లింది. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ కొరీ ఆండర్సన్, టెస్టు సిరీస్‌లో చెప్పుకోదగ్గ ఆటతో రాణించిన ల్యూక్ రోన్చీ సైతం విఫలమయ్యారు.

 హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆండర్సన్ ఔట్

హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆండర్సన్ ఔట్

మిడ్ వికెట్ స్థానంలో ఉమేష్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆండర్సన్ (4) అవుటయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొన్న రోన్చీ పరుగుల ఖాతా తెరవకుండానే హర్దిక్ పాండ్య బౌలింగ్‌లో ఉమేష్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జిమీ నీషమ్ (10), మిచెల్ సాంట్నర్ (0), డౌగ్ బ్రాస్‌వెల్ (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

 106 పరుగులకే ఎనిమిది వికెట్లు

106 పరుగులకే ఎనిమిది వికెట్లు

106 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు లాథమ్‌తో కలిసి టెయిల్ ఎండర్ టిమ్ సౌథీ ప్రయత్నించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లాథమ్‌ తన పోరాటాన్ని కొనసాగించాడు. మిశ్రా వేసిన 27 ఓవర్లో సింగిల్‌తో అర్ధ శతకం (77 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అతనికి బ్రేస్‌వెల్‌ (15) కాసేపు సహకరించాడు. బ్రేస్‌వెల్‌ను ఎట్టకేలకు మిశ్రా అవుట్‌ చేశాడు.

 టిమ్‌ సౌథీ సుడిగాలి ఇన్నింగ్స్‌

టిమ్‌ సౌథీ సుడిగాలి ఇన్నింగ్స్‌

ఈ దశలో టిమ్‌ సౌథీ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన లైఫ్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను 45 బంతలు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు సాధించి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో మనీష్ పాండే క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు.

 43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్

43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్

ఇష్ సోధీ (1)ని అమిత్ మిశ్రా ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. క్రీజ్‌లో పాతుకుపోయి నాటౌట్‌గా నిలిచిన లాథమ్ 98 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, అమిత్ మిశ్రా చెరి మూడు, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ చెరి రెండు చొప్పున వికెట్లు సాధించారు.

 తొలి వికెట్‌కు 49 పరుగులు

తొలి వికెట్‌కు 49 పరుగులు

స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్, రహానె తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆరంభంలో రోహిత్ కాస్త నెమ్మదిగా ఆడగా రహానే మాత్రం చూడచక్కటి షాట్లతో అలరించాడు. రోహిత్ శర్మ 14 పరుగులు చేసి డౌగ్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుట్‌కాగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ నిలకడగా ఆడాడు.

 అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ

అద్భుతమైన ఫామ్‌లో కోహ్లీ

ఆజింక్య రహానే 34 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి జిమీ నీషమ్ బౌలింగ్‌లో ల్యూక్ రోన్చీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వైస్‌ కెప్టెన్‌ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. మనీష్‌ పాండే (17)తో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు వంద పరుగుల వద్ద పాండే.. వెనుదిరిగాడు.

 క్రీజులో ధోని, కోహ్లీ

క్రీజులో ధోని, కోహ్లీ

అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నీషమ్‌ వేసిన 23వ ఓవర్లో హుక్‌ షాట్‌తో సిక్సర్‌ రాబట్టిన ధోనీ.. ఆ తర్వాత సోధి బౌలింగ్‌లో బౌండ్రీ సాధించాడు. మరోవైపు 55 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. లక్ష్యాన్ని చేరే సమయానికి కోహ్లీ 81 బంతుల్లో 85 (తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్), కేదార్ జాదవ్ 12 బంతుల్లో 10 (రెండు ఫోర్లు) నాటౌట్‌గా ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+