Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రాడ్‌కాస్టర్ తప్పిదం.. మిచెల్ స్టార్క్ వరల్డ్ రికార్డ్!

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌కాస్టర్ తప్పిదం కారణంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నిలిచాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. అయితే ఈ ఫీట్‌ను తాజా వన్డేలో మిచెల్ స్టార్క్ అధిగమించినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో తొలి బంతినే మిచెల్ స్టార్క్ గంటకు 176.5 కిలోమీటర్ల వేగంతో సంధించినట్లు బ్రాడ్ కాస్టర్ చూపించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మిచెల్ స్టార్క్ సాధారణంగా గంటలకు 140 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు. కానీ బ్రాడ్‌కాస్టర్ మాత్రం స్టార్క్ డెలివరీ స్పీడ్‌ను 176.5 కేపీహెచ్‌గా చూపించడంతో అంతా అవాక్కయ్యారు. కానీ అది స్పీడ్ గన్ తప్పిదం కారణంగా ఇలా చూపించారని తేలడంతో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ.. ఫాస్టెస్ట్ బౌలర్‌గా స్టార్క్‌ అంటూ బ్రాడ్‌కాస్టర్‌పై సెటైర్లు పేల్చుతున్నారు.

176 5 Kph Did Mitchell Starc Deliver the Fastest Ball in History to Rohit Sharma

ఈ మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను 26 ఓవర్లకు కుదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10), శ్రేయస్ అయ్యర్(11) తీవ్రంగా నిరాశపరిచారు. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ మధ్య ఆసీస్ పేసర్లు చెలరేగడంతో టీమిండియా 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్లు కుదించడంతో టీ20 తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Sunday, October 19, 2025, 14:21 [IST]
Other articles published on Oct 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+