15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీకి గర్ల్‌ఫ్రెండ్? ఫొటోలు వైరల్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సెలెబ్రిటీలకు శాపంగా మారింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ఏఐతో సృష్టించే అవకాశం ఉండటంతో ఆకతాయిలకు ఇది ఓ అస్త్రంగా పనిచేస్తోంది. ఏఐ సాయంతో సెలెబ్రిటీల కల్పిత ఫొటోలను సృష్టించి లేని పోని పుకార్లను వ్యాప్తి చేస్తున్నారు. ఈ విషయం తెలియక కొందరు నెటిజన్లు నిజమేనని భావించి వాటికి మరింత ప్రచారం కల్పిస్తున్నారు.
ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు ఏఐ కల్పిత ఫొటోలు, వీడియోలతో ఇబ్బంది పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కూడా డిమాండ్ చేశారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చేరాడు. 15 ఏళ్ల పసివాడైన వైభవ్ సూర్యవంశీ కూడా ఏఐ బాధితుడిగా మారాడు.
15 ఏళ్ల పసివాడితో ఫేక్ ఫొటోలు..
వైభవ్ సూర్యవంశీకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు.. ఆమెతో అతను చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని, పబ్లిక్‌గానే రోమాన్స్ చేస్తున్నాడనే విధంగా ఏఐ సాయంతో కల్పిత ఫొటోలను సృష్టించారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. వైభవ్ సూర్యవంశీతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు? అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిందంటూ సుద్దపూస మాటలను క్యాప్షన్‌గా పేర్కొంటున్నారు.

తమ అకౌంట్ రీచ్, ఫాలోవర్లను పెంచుకునేందుకు సెలెబ్రిటీలను బజారుకీడుస్తున్నారు. అభం శుభం తెలియని వైభవ్ సూర్యవంశీని కూడా బలి పశువును చేశారు. ఈ ఫొటోలను నిశితంగా చూస్తేనే ఇవి ఫేక్ అని తేలుతుంది. కానీ కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని గ్రహించలేక నిజమేనని పొరబడి షేర్ చేస్తున్నారు.
కానీ ఈ ఫొటోలు ఫేక్. 15 ఏళ్ల కుర్రాడిపై ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత అభిమానులు కోరుతున్నారు. ఈ ఫొటోల్లో సదరు అమ్మాయిని వైభవ్ ముద్దు పెట్టినట్లుగా కూడా క్రియేట్ చేశారు.
నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ..
ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 44 పరుగులు చేసిన వైభవ్.. అనవసర షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే అత్యుత్సాహం ప్రదర్శించి మూల్యం చెల్లించుకున్నాడు. 16 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 8 పరుగులే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. సహనం ప్రదర్శించకుండా చెత్త షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఈ పేలవ షాట్‌ను చూసి కామెంటేటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే సహనంతో ఉండటం నేర్చుకోవాలని గట్టిగా అరుస్తూ వైభవ్ సూర్యవంశీకి హితవు పలికారు. అభిమానులతో పాటు పలువురు క్రికెట్ విశ్లేషకులు సైతం వైభవ్ సూర్యవంశీపై విమర్శలు గుప్పించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


