Vaibhav Sooryavanshi: ఆ పిచ్చోడి రికార్డ్ బద్దలు కొట్టిన బుడ్డోడు!
రాజస్థాన్ రాయల్స్(RR) టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో 500 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా ఈ 15 ఏళ్ల సిక్సర పిడుగు నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్, మ్యాడ్ మ్యాక్స్‌వెల్ రికార్డ్‌ను వైభవ్ బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 8 పరుగులే చేసి వెనుదిరిగినా.. అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 260 బంతుల్లో 500 పరుగులు చేస్తే.. వైభవ్ సూర్యవంశీ 227 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 278 బంతుల్లో ఈ ఘనతను అందుకొని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 200+ స్ట్రైక్‌రేట్ 500 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌గా కూడా వైభవ్ నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 500 పరుగుల చేసిన బ్యాటర్లు..
వైభవ్ సూర్యవంశీ - 227 బంతులు
గ్లెన్ మాక్స్‌వెల్ - 260 బంతులు
ప్రియాన్ష్ ఆర్య - 278 బంతులు
వీరేందర్ సెహ్వాగ్ - 280 బంతులు
నమన్ ధీర్ - 283 బంతులు
ట్రావిస్ హెడ్ - 284 బంతులు
పృథ్వీ షా రికార్డ్ బద్దలు..
ఐపీఎల్‌లో 500 పరుగులు చేసి అత్యంత పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ 15 ఏళ్ల 26 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ప్రృథ్వీ షా రికార్డును బద్దలు కొట్టాడు. పృథ్వీ షా 19 ఏళ్ల 164 రోజుల వయసులో ఈ ఘనతను అందుకోగా.. సంజూ శాంసన్ 19 ఏళ్ల 195 రోజులు, రిషభ్ పంత్ 19 ఏళ్ల 220 రోజులు, ఇషాన్ కిషన్ 19 ఏళ్ల 295 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నారు. వైభవ్ సూర్యవంశీ సాధించి ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో చిన్న వయసులో 500 పరుగులు చేసిన బ్యాటర్లు..
వైభవ్ సూర్యవంశీ - 15 ఏళ్ల 26 రోజులు
పృథ్వీ షా - 19 ఏళ్ల 164 రోజులు
సంజు శాంసన్ - 19 ఏళ్ల 195 రోజులు
రిషబ్ పంత్ - 19 ఏళ్ల 220 రోజులు
ఇషాన్ కిషన్ - 19 ఏళ్ల 295 రోజులు
వైభవ్ విఫలం..
మోహ్‌సిన్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ అడబోయిన వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. పిచ్ కాస్త స్లోగా ఉండటంతో పరుగులు చేసేందుకు వైభవ్ ఇబ్బంది పడ్డాడు. 11 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications