Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs IRE: వైభవ్ సూర్యవంశీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. టికెట్లకు భారీ డిమాండ్! అదనపు సీట్లు ఏర్పాటు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దాంతో భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో స్టేడియంలో అదనపు సీట్లు ఏర్పాటు చేయడంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు దృష్టి సారించింది.

చారిత్రాత్మక మ్యాచ్..

ఐర్లాండ్‌లో బెల్‌ఫాస్ట్‌లోని స్టార్‌మాంట్ వేదికగా తొలి టీ20 జరగనుంది. కేవలం 15 ఏళ్ల 91 రోజుల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగితే.. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా అతను సరికొత్త రికార్డ్ సృష్టిస్తాడు. ఈ చారిత్రాత్మక ఘటనను వీక్షించేందుకు పారిస్ సహా యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్‌ఫాస్ట్‌కు తరలివస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ ఇన్.. సంజూ ఔట్! ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వైభవ్ సూర్యవంశీ ఇన్.. సంజూ ఔట్! ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

కానీ ఈ స్టేడియం కెపాసిటీ 7000 సీట్లే కావడంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అభిమానులు అధిక సంఖ్యలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపుతుండటంతో అదనపు సీట్లు ఏర్పాటు చేయాలని ఐర్లాండ్ క్రికెట్ నిర్వాహకులు భావిస్తున్నారు.

15-Year-Old Prodigy Vaibhav Sooryavanshi Fever Tickets For India Vs Ireland T20I Series Sold Out In Minutes

ఈ విషయంపై భారత్, ఐర్లాండ్ దేశాల తరఫున ఆడిన మాజీ క్రికెటర్ ఎం.వి.నరసింహారావు స్పందిస్తూ.. 'అభిమానుల నుంచి టికెట్ల కొరకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మైదానంలో తాత్కాలికంగా అదనపు సీట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఐర్లాండ్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఇక్కడి అభిమానులకు కూడా ఒక చారిత్రాత్మక దినం అవుతుంది.

వైభవ్ సూర్యవంశీ కోసం వారిని తప్పించడం అన్యాయం: టీమిండియా బ్యాటింగ్ కోచ్

వైభవ్ సూర్యవంశీ కోసం వారిని తప్పించడం అన్యాయం: టీమిండియా బ్యాటింగ్ కోచ్

ఇంగ్లండ్‌లోనే అసలు సవాల్..

ఐర్లాండ్ పిచ్‌లు సాధారణంగా నెమ్మదిగా ఉంటాయి. ఐర్లాండ్‌లో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు లేకపోవడం వైభవ్‌కు ఒక రకంగా కలిసొచ్చే అంశం. అయితే.. భవిష్యత్తులో ఇంగ్లండ్‌లో ఆడేటప్పుడు మాత్రం అతనికి గట్టి సవాలు ఎదురవుతుంది. అక్కడి స్వింగ్ పిచ్‌ పరిస్థితులు, మారుతున్న వాతావరణంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.’అని నరసింహరావు అభిప్రాయపడ్డారు.

అయితే వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 15 ఏళ్ల వైభవ్ కోసం జట్టులో ఎంతో కాలంగా ఆడుతున్న ఆటగాళ్లను పక్కనపెట్టలేమని, అలా చేయడం కూడా అన్యాయమని బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ అనడం వైభవ్ అరంగేట్రంపై సందేహాలు నెలకొనేలా చేసింది.

Story first published: Friday, June 26, 2026, 13:35 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+