For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు అడ్డంకిగా మారిన క్వారంటైన్ రూల్!

14-day quarantine rule puts Australia vs India T20I series under scanner

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్‌‌కు క్వారంటైన్ రూల్‌ అడ్డంకిగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచక్‌పనకు ముందే అక్టోబర్‌ 11 నుంచి 17 వరకు ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌ జరగాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి టెస్టు, జనవరి 12 నుంచి వన్డే సిరీ్‌సలుంటాయి. అ0యితే పొట్టి ప్రపంచకప్‌ వాయిదాపడడంతో ఐపీఎల్‌ను నిర్వహించాలని చూస్తున్న బీసీసీఐ.. ఆసీస్‌తో మూడు టీ20లను నవంబరు చివర్లో జరిపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది.

కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న 14 రోజుల క్వారంటైన్‌ నిబంధన దీనికి అడ్డంకిగా మారింది. నవంబరు 8న ఐపీఎల్‌ ఫైనల్‌ ముగించుకుని ఆటగాళ్లు ఆసీస్‌లో అడుగుపెట్టాక 14 రోజుల పాటు హోటళ్లలోనే గడపాల్సి ఉంటుంది. అదే జరిగితే టెస్టు సిరీస్‌కు సమాయత్తం కావడానికి తగిన సమయం ఉండదు. 'ఆస్ట్రేలియా నుంచి వచ్చాక వెంటనే ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడాల్సి ఉంది. అందుకే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాతైనా టీ20లు ఆడించాలనుకున్నా వీలు కాదు. కనీసం వారం, పది రోజుల విశ్రాంతి లేకుండా ఆటగాళ్లను విభిన్న ఫార్మాట్‌లో ఆడించలేం. అందుకే ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఫిబ్రవరికి మారినా ఆశ్చర్యం లేదు'అని ఓ బోర్డు అధికారి తెలిపాడు.

Story first published: Friday, July 24, 2020, 12:43 [IST]
Other articles published on Jul 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+