Virat Kohli: రికార్డుల రారాజు.. ప్రపంచం మెచ్చిన మొనగాడి ప్రస్థానానికి 13 ఏళ్లు!

మైకేల్ తెలుగు ప్రత్యేకం: సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా..ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇప్పిటికే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడిగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి బుధవారంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

అండర్-19 ప్రపంచకప్ విజయంతో
2008 అండర్-19 ప్రపంచకప్‌కు జట్టుకు సారథ్యం వహించిన కోహ్లీ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్ ఆటగాడిగా అదరగొట్టాడు. అండర్-19 ప్రపంచకప్ విజయంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ నుంచి పిలుపునందుకున్నాడు. ఆపైన అదే ఏడాది శ్రీలంకతో సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది.

ఫస్ట్ మ్యాచ్‌లో విఫలం..
అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) నెరవేరింది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతోనే టోర్నీ భారత్ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు. తరవాతి సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.

గంభీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్‌తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే కోహ్లీ ఆటకు ముగ్దుడైన గంభీర్ తనకు ఇచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చేసాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. కెప్టెన్‌గా ఎదిగాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టడానికి దూసుకెళ్తున్నాడు. అప్రతిహతంగా సాగిన అతని జోరుకు బ్రేక్ పడింది. గత రెండేళ్లుగా అతను నిలకడలేమి ఆటతో తడబడుతున్నాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలోనైనా సెంచరీ బాది మునపటి ఫామ్ అందుకోవాలని యావత్ భారతం ఎదురుచూస్తోంది.

#13YearsOfViratKohli ట్రెండింగ్..
ఇక కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు విరాట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు. సూపర్ రికార్డులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో #13YearsOfViratKohli హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సీడీపీ, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున 254 వన్డేలు, 94 టెస్ట్‌లు,89 టీ20లు ఆడాడు. వన్డేల్లో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలతో 12169 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 7609 రన్స్ చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలున్నాయి. 82 టీ20ల్లో 28 హాఫ్ సెంచరీలతో 3159 రన్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications