Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ తీయలేకపోయాడు.

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

అతని వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. 11 ప్రయత్నాల తర్వాత భారత్‌ను ఓడించి ఐర్లాండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ వేసిన 17వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్‌లో వైభవ్ మూడు సిక్స్‌లతో పాటు రెండు బౌండరీలతో 27 పరుగులు సమర్పించుకున్నాడు.

125 Runs in Two Games Prasidh Krishna Brutally Trolled Online After Consecutive T20I Meltdowns

దాంతో ఐర్లాండ్ 182 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఈ క్రమంలోనే ప్రసిధ్ కృష్ణ తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. అసలు ప్రసిధ్ కృష్ణను మూడు ఫార్మాట్ల బౌలర్‌గా ఎందుకు గుర్తిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు.

వాస్తవానికి ప్రసిధ్ కృష్ణ టీ20 బౌలర్ కాదు. అతను భారత్ తరఫున చివరి టీ20 మ్యాచ్‌‌ను 2023లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో అతనికి మరోసారి టీ20 ఆడే అవకాశం దక్కింది. కానీ తొలి మ్యాచ్‌లోనే అతను దారుణంగా విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడు.

IND vs IRE: ఆ విషయంలో మేం విఫలమయ్యాం: అభిషేక్ శర్మ

IND vs IRE: ఆ విషయంలో మేం విఫలమయ్యాం: అభిషేక్ శర్మ

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 8 ఓవర్లలో 125 పరుగులు సమర్పించుకొని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మరే భారత బౌలర్ కూడా వరుసగా రెండు ఓవర్లలో ఇన్ని పరుగులు ఇచ్చుకోలేదు. ఈ క్రమంలోనే ప్రసిధ్ కృష్ణను భారత జట్టు నుంచి తొలగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే 'ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం'అని ఘాటుగా విమర్శిస్తున్నారు. తొలి టీ20 విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఆ మ్యాచ్‌ నుంచి ప్రసిధ్ కృష్ణను తప్పించనున్నారు. అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేయవచ్చు.

Story first published: Saturday, June 27, 2026, 16:30 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+