Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెద్దోళ్ల ఆటలో 12 ఏళ్ల చిన్నోడు సెంచరీ బాదాడు!

12-year-old scores century in ADULT cricket match

లండన్‌: వయస్సు 12 ఏళ్లే.. అయితేనేం ప్రతిభకు అదేం అడ్డు కాదని నిరూపించాడు. అది కూడా సీనియర్‌ జట్టులో ఆడుతూ తన అసాధారణ ప్రతిభతో సెంచరీ కొట్టేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బూరపరిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన మన్‌మౌత్‌ సైంటిఫిక్‌ సోమర్సెట్‌ లీగ్‌లో థామస్‌ రూ అనే 12 ఏళ్ల పిల్లోడు.. ఏకంగా అజేయ శతకం (113 నాటౌట్‌) బాది జట్టును గెలిపించాడు.

తద్వారా ఈ లీగ్‌లో అత్యంత పిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడుగా రికార్డుకెక్కాడు. గత శనివారం వెంబ్డన్ ఫోర్త్ ఎలెవెన్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల థామస్‌ రూ... టాంటన్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ 'బి' తరఫున బరిలోకి దిగాడు. సోమర్సెట్‌ అండర్‌-13 ఆటగాడైన థామస్‌ పురుషుల క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించడంతో ఇక్కడా తన సత్తా చాటుకున్నాడు.

కెప్టెన్‌ స్టువర్ట్ హకీ(74)తో కలిసి తొలి వికెట్‌కు 140 పరుగులు జత చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. థామస్ ధాటికి టాంటన్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 240 రన్స్ చేసింది. అనంతం ఛేజింగ్‌కు దిగిన వెంబ్డన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులకే పరిమితమవడంతో థామస్ రూ టీమ్ 41 రన్స్‌తో గెలుపొందింది.

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన థామస్ రూపై టాంటన్ సెయింట్ ఆండ్రూస్ బి కెప్టెన్ హకీ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాడని, సూపర్బ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. 'మా క్లబ్‌లో థామస్ ఉండటం నిజంగా మా అదృష్టం. శనివారం అతని ఆట చూసిన తరువాత ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్‌లో థామస్ జట్టులో ఉంటాడు. అతనితో ఓపెనింగ్ చేసేటప్పుడు నా వయసు అతనికి నాలుగు రెట్లని తెలిసింది.

క్రీజులో మరో ఎండ్‌లో నుంచి థామస్ ఆటను చూస్తే అపారమైన నైపుణ్యం కలిగిన ఆటగాడనిపించింది. ఇంత చిన్న వయసులో అతను ఆడే షాట్లు చూడ ముచ్చటగా ఉన్నాయి. అతని టైమింగ్, బౌండరీలు కొట్టే విధానం అద్భుతం.'అని హకీ చెప్పుకొచ్చాడు. ఇక ఇది అతనికి రెండో మ్యాచ్ అని తొలి ఆటలో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడన్నాడు.

Story first published: Wednesday, August 12, 2020, 11:33 [IST]
Other articles published on Aug 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+