Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క క్యాచ్‌తో రూ.1.08 కోట్లు!

సౌతాఫ్రికా 20 లీగ్‌‌తో ఓ అభిమాని పంట పండింది. బ్యాటర్ కొట్టిన భారీ సిక్సర్‌ను క్యాచ్ పట్టినందుకు భారీ క్యాష్ ప్రైజ్ వరించనుంది. సౌతాఫ్రికా 20 లీగ్‌లో భాగంగా ఢిల్లీ సూపర్ జెయింట్స్, ముంబై కేప్‌టౌన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ సూపర్ జెయింట్స్ మఫకా బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ కొట్టిన బంతిని స్టాండ్స్‌లో ఒంటి చేత్తో ఓ అభిమాని క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌కు రివార్డ్‌గా సదరు అభిమానికి రూ.1.08 కోట్లు దక్కనుంది. అయితే ఈ సీజన్ ముగిసేలోపు మరే అభిమాని కూడా ఇలా క్యాచ్ పట్టవద్దు. అప్పుడే ఈ భారీ నగదు బహుమతి మొత్తం అతనికి సొంతమవుతుంది. లేదంటే ఈ క్యాష్ ప్రైజ్‌ను ఇతర అభిమానులతో పంచుకోవాల్సి వస్తుంది.

1 08 Crore for One Catch SA20 Fan s One-Handed Stunner Steals the Show at Newlands

స్టేడియానికి ప్రేక్షకులను రప్పించేందుకు సౌతాఫ్రికా 20 లీగ్ నిర్వాహకులు ఈ ఆఫర్ పెట్టారు. ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగుల భారీ స్కోర్ చేసింది. డెవాన్ కాన్వే(64) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(40), ఎయిడెన్ మార్క్‌రమ్(35) రాణించారు. ముంబై బౌలర్లలో జార్జ్ లిండే రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బోష్, ట్రిస్టన్ లుస్ తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓటమిపాలైంది. ర్యాన్ రికెల్టన్(113) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఈథన్ బోష్(4/46) నాలుగు వికెట్లు తీయగా.. డేవిడ్ వైస్, సిమన్ హర్మర్, క్వెనా మఫకా తలో వికెట్ తీసారు.

Story first published: Monday, December 29, 2025, 12:22 [IST]
Other articles published on Dec 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+