For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్.. సెమీఫైనల్లో నిఖత్ జరీన్

సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ దుమ్మురేపుతోంది. ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపిస్తూ సెమీఫైనల్లో‌కి దూసుకెళ్లింది.గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు వరల్డ్‌కప్ గోల్డ్ మెడలిస్ట్ హితేష్ గులియా, వరల్డ్ ఛాంపియన్ మీనాక్షి హుడా విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు.

మహిళల 45-48 కేజీల విభాగంలో ఆలిండియా పోలీస్ తరఫున బరిలోకి దిగిన మీనాక్షి 5-0తో పంజాబ్‌ బాక్సర్ కాశిష్ మెహతాను ఓడించింది. మహిళల 48-51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో మణిపూర్‌కు చెందిన లాంచెన్‌బీ చాను టోంగ్‌బ్రామ్‌ను చిత్తు చేసింది. మహిళల 51-54 కేజీల విభాగంలో ప్రీతి 5-0తో హర్మీత్ కౌర్‌పై, సాక్షి 4-1తో పూనమ్‌పై విజయం సాధించారు.

World Champion Nikhat Zareen Cruises Into Semifinals at Senior National Boxing Championships

పురుషుల 65-70 కేజీల కేటగిరిలో హితేష్ 5-0తో పంజాబ్ బాక్సర్ తేజస్వినిని ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 50-55 కేజీల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ సిల్వర్ మెడలిస్ట్ పవన్ భార్త్వాల్, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన టైసన్‌ను ఓడించగా, జదుమణి సింగ్ (50-55 కేజీలు) పంజాబ్ బాక్సర్ నిఖిల్ పై విజయం సాధించాడు. 55-60 కేజీల విభాగంలో సచిన్.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కరణ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది.

Story first published: Thursday, January 8, 2026, 17:10 [IST]
Other articles published on Jan 8, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+