For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paris Olympics 2024: నిఖత్ జరీన్ శుభారంభం..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌‌లో వరల్డ్ ఛాంపియన్స్ నిఖత్ జరీన్ 5-0తో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాను మట్టికరిపించింది. ఈ విజయంతో నిఖత్ జరీన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

నిఖత్ జరీన్ పంచ్ పవర్‌, దూకుడుకు కరీనా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కెరీర్‌లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న నిఖత్ జరీన్.. అంచనాలకు తగ్గట్లుగా దూసుకెళ్తోంది. పొడువుగా ఉండటం జర్మన్ బాక్సర్‌కు డిస్ అడ్వాంటేజ్‌గా మారింది. వ్యూహాత్మక వ్యహరించిన నిఖత్ జరీన్.. అదిరిపోయే పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది.

Paris Olympics 2024 Nikhat Zareen enters pre-quarterfinals with gritty win over Kloetzer

గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో నిఖత్ జరీన్.. టాప్ సీడెడ్, వరల్డ్ ఛాంపియన్, చైనా బాక్సర్ వు యు‌తో తలపడనుంది. వు యుకి బై పడటంతో ఆమె నేరుగా రెండో రౌండ్‌లో ఆడనుంది.

నిరాశపర్చిన స్విమ్మర్లు..
స్విమ్మింగ్ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. భారత యంగెస్ట్ ఒలింపియన్ ధినిది మహిళల 200 మీటర్ల ఫ్రీ‌స్టైల్ ఈవెంట్‌లో 23వ స్థానంలో నిలిచి ఫైనల్‌కుఅర్హత సాధించలేకపోయింది. ఆమె 2 నిమిషా 6.96 సెకన్లలో ఫ్రీ స్టైల్ ఈవెంట్‌ను పూర్తి చేసింది

స్విమ్మింగ్ పరుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శ్రీహరి నటరాజ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతను 33వ స్థానంలో నిలిచాడు.

మనికా బత్రా శుభారంభం..
టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మనికా బత్రా 4-1తో గ్రేట్ బ్రిటన్ అన్నా హర్సెటీపై విజయం సాధించింది. అంతకుముందు మరో పాడ్లర్ ఆకుల శ్రీజ కూడా విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.

Story first published: Sunday, July 28, 2024, 17:45 [IST]
Other articles published on Jul 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+