For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయసు మీదపడినా.. 15 ఏళ్ల తర్వాత బరిలోకి దిగినా.. టైసన్ పంచ్‌లో పవర్ తగ్గలేదు!

Mike Tyson Returns To Ring, Draws in Exhibition With Roy Jones Jr

లాస్‌ ఏంజిల్స్‌: వయసు మీదపడినా తన పంచ్‌ పవర్‌ తగ్గలేదని మాజీ హెవీ వెయిట్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ నిరూపించాడు. కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన 15 ఏళ్ల తర్వాత రింగ్‌లోకి దిగినా మునుపటి జోరునే ప్రదర్శించాడు. ఫోర్‌ డివిజన్‌ మాజీ చాంపియన్‌ రాయ్‌ జోన్స్‌ జూనియర్‌తో ఆదివారం జరిగిన ఎగ్జిబిషన్‌ బౌట్‌లో 54 ఏళ్ల టైసన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు నిమిషాల చొప్పన ఎనిమిది రౌండ్లపాటు జరిగిన బౌట్‌లో 51 ఏళ్ల రాయ్‌పై టైసన్‌ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు.

ప్రత్యర్థి శరీరంపైనా, తలపైనా పిడిగుద్దులు కురిపించాడు. రెండు నిమిషాల చొప్పున ఎనిమిది రౌండ్ల పాటు పోటీ పడిన మాజీ చాంపియన్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఫ్యాన్స్‌కు మరచిపోలేని కిక్ అందించారు.

ముఖ్యంగా టైసన్ తన మార్కు బాడీ షాట్స్ హెడ్ పంచ్‌లతో జోన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. జోన్స్ కూడా తన స్టయిల్‌‌లో టైసన్‌కు పంచ్‌లు రుచి చూపించాడు. అయితే, ఈ బౌట్‌ డ్రాగా ముగిసినట్టు వరల్డ్‌ బాక్సింగ్‌ మండలి (డబ్ల్యూబీసీ) జడ్జీలు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన నియమాల ప్రకారం ఈ బౌట్‌లో నాకౌట్‌లు లేవు.. విజేతలు ఉండరు. ఎవరికైనా గాయమైతే పోటీని నిలిపివేయాలి.

Story first published: Monday, November 30, 2020, 8:34 [IST]
Other articles published on Nov 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+