Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేరీకోమ్‌ కామన్వెల్త్‌ ఆశలు ఆవిరి.. బెర్త్‌కు అడుగు దూరంలో నిఖత్‌ జరీన్!

 Mary Kom ruled out of CWG after suffering knee injury in selection trials, Nikhat Zareen enters final

న్యూఢిల్లీ: భారత మహిళా దిగ్గజ బాక్సర్‌.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనాలన్న ఆశలు ఆవిరయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కిలోల విభాగం సెమీస్‌ బౌట్‌లో నీతుతో మేరీ తలపడింది. అయితే, తొలి రౌండ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే ఎడమ మోకాలు మెలి పడటంతో మేరీ కింద పడింది. దీంతో రెఫరీ బౌట్‌ నిలిపివేసి కొద్దిసేపు విరామం ఇచ్చాడు. వ్యక్తిగత ఫిజియో సపర్యలు చేశాక తిరిగి పోటీని ప్రారంభించగా, కొద్దిసేపటి తర్వాత మేరీ ఆ నొప్పిని భరించలేక పోటీ నుంచి వైదొలిగింది.

కన్నీళ్లతో..

కన్నీళ్లతో..

దీంతో రెఫరీ నీతూను విజేతగా ప్రకటించడంతో మేరీ భావోద్వేగానికి గురవుతూ రింగ్‌ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్‌వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు.

అడుగు దూరంలో నిఖత్..

అడుగు దూరంలో నిఖత్..

ఇక తెలంగాణ స్టార్ బాక్సర్,వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లోనూ నిఖత్ పవర్ పంచ్‌లతో అదరగొట్టింది. ఫలితంగా గేమ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. 50 కిలోల విభాగంలో నిఖత్‌ జరీన్‌ సెమీస్‌లో 7-0తో అనామిక (రైల్వేస్)పై నెగ్గి ఫైనల్‌ చేరింది. బౌట్ ఆరంభం నుంచే భిన్నమైన స్ట్రాటజీతో పంచ్‌లు విసిరిన నిఖత్.. అనామికకు ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. బలమైన హుక్ షాట్స్, అప్పర్ కట్స్‌తో విరుచుకుపడటంతో జడ్జిలు ఏకగ్రీవంగా నిఖత్‌ను విజేతంగా ప్రకటించారు.

లవ్లీనా సైతం..

లవ్లీనా సైతం..

శనివారం జరగబోయే ఫైనల్‌లో మీనాక్షితో నిఖత్‌(హర్యానా)తో తలపడనుంది. ఈ బౌట్‌లో విజయం సాధిస్తే నిఖత్‌కు కామన్వెల్త్‌ బెర్త్‌ ఖాయమవుతుంది. మరోవైపు 70 కేజీల బౌట్‌లో టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్ కూడా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. సెమీస్‌లో లవ్లీనా 7-0తో అంకుషిత(అస్సాం)ను ఓడించింది. జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కావన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి.

Story first published: Saturday, June 11, 2022, 7:58 [IST]
Other articles published on Jun 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+