Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌పై నా విజయం.. కార్గిల్ హీరోలకు అంకితం: భారత బాక్సర్

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత బాక్సర్ జాదుమణి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 55 కేజీల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఈ 22 ఏళ్ల మణిపుర్ బాక్సర్ 5-0తో పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో భారత్‌కు పతక ఆశలు రేకెత్తించాడు. అయితే ఈ పోరు కార్గిల్ విజయ్ దివస్ నాడు జరగడంతో ఈ విజయాన్ని జాదుమణి కార్గిల్ హీరోలకు అంకితం చేశాడు.

CWG 2026: వరుసగా మూడో స్వర్ణం: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను!

CWG 2026: వరుసగా మూడో స్వర్ణం: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను!

ఈ విజయానంతరం మాట్లాడిన అతను పాక్‌పై విజయం సాధించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. 'మన కార్గిల్ హీరోలకు నా విజయం అంకితం. పాకిస్థాన్ బాక్సర్‌ను ఓడించినందుకు సంతోషంగా.. గర్వంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. భారత్‌కు బంగారు పతకం అందించడమే నా లక్ష్యం'అని జాదుమణి పేర్కొన్నాడు.

Indian boxer Jadumani Singh dedicates victory over Pakistan s Rehman to Kargil heroes in Commonwealth Games 2026

1999 కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది జులై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ రోజునే జాదుమణి విజయం సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. తొలి రౌండ్‌లో బై దక్కడంతో పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్ నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. కానీ భారత బాక్సర్ దెబ్బకు చిత్తుగా ఓడాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బాక్సర్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు.

Commonwealth Games 2026: తృటిలో స్వర్ణం మిస్.. భారత్ ఖాతాలో రెండో పతకం!

Commonwealth Games 2026: తృటిలో స్వర్ణం మిస్.. భారత్ ఖాతాలో రెండో పతకం!

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు భారత్ నాలుగు పతకాలను గెలుచుకుంది. పారా పవర్ లిఫ్టింగ్‌లో జాండు కుమార్ కాంస్య పతకంతో తొలి మెడల్ అండించగా.. పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను బంగారు పతకం గెలిచింది. పురుషుల 65 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో ముతుపండి రాజా సిల్వర్ మెడల్ సాధించాడు. బాక్సింగ్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది.

Story first published: Monday, July 27, 2026, 12:06 [IST]
Other articles published on Jul 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+