Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనేందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి, అలాంటి మనుషుల్ని ఇష్టపడను: మేరీ కోమ్ ప్రవర్తనపై కామెంట్లు!

Dont Like People with Such Nature: Mary Kom Explains Hand Shake Snub After Beating Nikhat Zareen

హైదరాబాద్: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తన అసహనాన్ని ప్రదర్శించింది.

నిఖత్‌ జరీన్‌తో బౌట్‌ తర్వాత క్రీడా స్ఫూర్తిని మాత్రం మరిచింది. 51 కిలోల విభాగంలో గెలిచిన మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి జరీన్‌ చేయి చాపగా దానిని తిరస్కరించింది. నిఖత్‌ జరీన్‌ చేతిని విదిల్చుకుని మరీ వెళ్లిపోయింది. దీనిపై బౌట్‌ తర్వాత వివరణ కోరగా తాను ఎందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది.

నేనేందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి

"ఆమెకు నేనేందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలి. నేను గౌరవించాలని ఆమె అనుకుంటే, ముందుగా ఆమె ఇతరులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. జరీన్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని ఇష్టపడను. నేను కేవలం రింగ్‌లో మాత్రమే ఆమెతో అమీతుమీ తేల్చుకోవాలి. అంతేకానీ బయట కాదు" అని మేరీకోమ్‌ వ్యాఖ్యానించింది.

క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో

క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన 51 కేజీల విభాగంలో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్‌ జరీన్‌పై గెలు పొందింది. ఈ విజయంతో మేరీకోమ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్‌ తన ప్రత్యర్ధి నిఖత్ జరీన్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించింది. చివరి వరకు పూర్తి ఆధిపత్యం కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంది.

51 కేజీలో విభాగంలో

51 కేజీలో విభాగంలో

51 కేజీలో విభాగంలో టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం చెలరేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది. గతంలో మేరీ కోమ్ వేరే విభాగంలో తలపడేది. అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె 51 కిలోల విభాగానికి మారింది. దీంతో అదే విభాగంలో పోటీపడుతున్న జరీన్‌కు ఒలింపిక్స్‌కు అవకాశం లేకుండా పోయింది. అనుభవశాలి మేరీకోమ్‌‌ను ట్రయల్స్‌తో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్‌కు పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించాడు.

మహిళా ఉద్యోగితో ఢిల్లీ అండర్-23 క్రికెటర్ల అసభ్య ప్రవర్తన: వేటు వేసిన డీడీసీఏ

నిఖత్‌ జరీన్ అభ్యంతరం

నిఖత్‌ జరీన్ అభ్యంతరం

దీంతో భారత బాక్సింగ్ సమాఖ్యలో వివాదం మొదలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్‌ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రికి ట్విట్టర్ వేదికగా లేఖ రాసింది. ఈ క్రమంలో మేరీకోమ్‌ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

జీర్ణించుకోలేకపోయిన మేరీ కోమ్

జీర్ణించుకోలేకపోయిన మేరీ కోమ్

నిఖత్‌ జరీన్ ట్రయల్స్‌ పెట్టాలనే నిర్ణయాన్ని మేరీకోమ్‌ జీర్ణించుకోలేకపోతోంది. శనివారం వీరిద్దరి మధ్య నిర్వహించిన ట్రయల్స్‌లో నిఖత్ జరీన్‌పై మేరీ కోమ్ గెలవడంతో తన అసహనాన్ని వెళ్లగక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు సాటి బాక్సర్‌ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని కామెంట్లు వస్తున్నాయి.

మేరీకోమ్‌ ప్రవర్తన నచ్చలేదన్న జరీన్

మేరీకోమ్‌ ప్రవర్తన నచ్చలేదన్న జరీన్

మ్యాచ్‌ తర్వాత మేరీకోమ్‌ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని నిఖత్‌ తెలిపింది. నిఖత్ జరీన్ మాట్లాడుతూ "మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంపైర్‌ విజేతను ప్రకటించారు. ఆ క్షణం నేను మేరీని హత్తుకునే ప్రయత్నం చేశాను, కానీ ఆమె తిరస్కరించింది. ఒక జూనియర్‌గా నాకు సీనియర్ల నుంచి గౌరవం దక్కుతుందని ఆశించాను. కానీ మేరీ కోమ్ తీరు నన్ను హార్ట్‌ చేసింది" అని పేర్కొంది.

Story first published: Saturday, December 28, 2019, 17:47 [IST]
Other articles published on Dec 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+