For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth గేమ్స్‌‌కు తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. లవ్లీనా, నీతూ, జాస్మిన్‌ కూడా..

 Commonwealth Games 2022: Nikhat Zareen, Lovlina Borgohain Among Four Women Earn Spots

న్యూఢిల్లీ: కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్‌.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది.

నా సత్తాలో సగం కూడా ప్రదర్శించలేదు..

నా సత్తాలో సగం కూడా ప్రదర్శించలేదు..

'తిరిగి నా లయ అందుకోవడానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ తర్వాత నేను ప్రాక్టీస్ చేయలేదు. ఇంటికి వెళ్లి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పోలిస్తే ఈ ట్రయల్స్‌లో 50 శాతం ప్రదర్శన కూడా చేయలేదని తెలుసు. అయినప్పటికీ నా ప్రత్యర్థులందరిపై ఏకపక్ష విజయాలు సాధించా. నేనెప్పుడూ పోటీపడే బరువు విభాగం ఇది కాదు. దీనికి తగ్గట్లుగా మారేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉంది. అలసట నుంచి కోలుకునేందుకు కొన్ని రోజుల విశ్రాంతి తీసుకుని నా సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఫోకస్ పెడతా'' అని విజయానంతరం నిఖత్‌ తెలిపింది.

 అహం పెరిగిందంటారని..

అహం పెరిగిందంటారని..

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత లవ్లీనా (70 కేజీలు).. పూజ (రైల్వేస్‌)పై నెగ్గి కామన్వెల్త్ బెర్త్ సాధించింది. 'ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ తర్వాత దీని కోసం ఎంతో కష్టపడ్డా. టోక్యోలో పసిడి నెగ్గాలనుకున్నా కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారిద్దామనుకుంటే బయట కార్యక్రమాల కారణంగా సమయం దొరకలేదు. ఎన్నో సన్మాన, ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ రాలేను అని చెబితే పతకం గెలవగానే అహం పెరిగిందని అనుకుంటారని వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రాక్టీస్‌ దెబ్బతింది. అది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రభావం చూపింది'' అని లవ్లీనా పేర్కొంది.

జూలై 28 నుంచి..

జూలై 28 నుంచి..

నీతూ (48), జాస్మిన్‌ (60) కూడా కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికయ్యారు. ట్రయల్స్‌ ఫైనల్‌ బౌట్లలో లవ్లీనా 7-0తో పూజ (రైల్వే్‌స)పై, నీతు 5-2తో మంజూ రాణిపై, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత పర్వీన్‌ హుడాపై జాస్మిన్‌ జడ్జిల ఏకగ్రీవ నిర్ణయంతో గెలుపొందారు.కామన్వెల్త్‌ క్రీడలు వచ్చేనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్నాయి. కాగా, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ ట్రయల్స్‌ సందర్భంగా గాయానికి గురవడంతో ఈసారి క్రీడలకు ఆమె దూరం కానున్న సంగతి తెలిసిందే.

Story first published: Sunday, June 12, 2022, 8:17 [IST]
Other articles published on Jun 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+