Lovlina Borgohain:డీఎస్పీగా ఒలింపిక్ మెడలిస్ట్!

డిస్పూర్: టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరిసిన భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. మెడల్ గెలిచినప్పుడు లవ్వీనా సొంత రాష్ట్రమైన అసోం ప్రభుత్వం భారీ నజరానాతో పాటు డీఎస్పీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. ఆ హామీ మేరకు డీఎస్పీ పదవికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్‌ను బుధవారం లవ్లీనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. లవ్లీనా భవిష్యత్తులో ఎస్పీ కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయనే డీఎస్పీ పదవి అపాయింట్మెంట్ లెటర్‌ను లవ్లీనాకు అందజేశారు.
రాష్ట్రానికే గర్వకారణం..
టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా మెడల్ సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇప్పటి నుంచి బాక్సర్‌కు నెల జీతంతో పాటు ట్రైనింగ్ కోసం అదనంగా రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గువాహటిలోనే ఆమె బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ కోచ్‌ను నియమిస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు కూడా లవ్లీనా పేరు పెడతామని చెప్పారు.

బాక్సింగ్‌పైనే ఫోకస్..
పోలీసు శాఖలో ఉద్యోగం రావడంపై బాక్సర్ లవ్లీనా హర్షం వ్యక్తం చేసింది. 'అసోం పోలీసు శాఖలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. కానీ, నా దృష్టంతా క్రీడలపై, పతకం గెలవడంపైనే ఉంటుంది. ప్రస్తుతం బాక్సింగ్ ట్రైనింగ్‌పైనే పూర్తిస్థాయిలో దృష్టిపెడతాను. బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాకే డ్యూటీలో చేరుతాను.' అని లవ్లీనా చెప్పుకొచ్చింది.

బ్రాంజ్ మెడల్‌తోనే..
మహిళల 64-69 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో లవ్లీన్ బ్రాంజ్ మెడల్ సాధించింది. క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి బ్రాంజ్ మెడల్ ఖాయం చేసుకున్న లవ్లీనా.. సెమీ ఫైనల‌్‌లో 0-5 తేడాతో టర్కీ బాక్సర్, వరల్డ్ చాంపియన్ సుర్మెనెలి బుసెనాజ్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో రజతం లేదా, స్వర్ణ పతకం గెలవాలనుకున్న లవ్లీనాకు నిరాశే ఎదురైంది. ఈ పతకంతో ఒలింపిక్స్‌లో అడుగు పెట్టడంతోనే పతకాన్ని అందుకున్న యువతిగా రికార్డు సృష్టించారు. బాక్సింగ్‌లో ఇద్దరికి బ్రాంజ్ మెడల్ ఇస్తారన్న విషయం తెలిసిందే.

లవ్లీనా విజయం.. సొంత ఊరికి రోడ్డు..
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత.. ఆమె స్వగ్రామం రూపు రేఖలు మారిపోయాయి. అస్సాం గోలాఘాట్ జిల్లాలోని బారాముఖియా ఆమె స్వగ్రామం. అప్పర్ అస్సాం బర్బథార్ టౌన్‌కు మూడున్నర కిలోమీటర్ల దూరంలోఈ కుగ్రామం ఉంటుంది. సుమారు రెండువేల మంది వరకు జనాభా ఉంటుందక్కడ. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బిశ్వజిత్ ఫుకన్ ఎనికయ్యారు. ఎలాంటి ఆదరణకు నోచుకోని చిన్న పల్లెటూరు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని ఊరు. లవ్లీనా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న వెంటనే- ఆ గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన రోడ్డును మంజూరు చేసింది అక్కడి ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications