Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yearender 2020: బ్యాడ్మింటన్ భారంగానే.. ఈ ఏడు మన రాకెట్లు తుస్సుమన్నాయి!

Yearender 2020: Forgettable year for Indian shuttlers

ఇటు సింధు.. అటు సైనా..! ఓవైపు శ్రీకాంత్.. మరోవైపు సాయి ప్రణీత్.! వరుస పెట్టి పతకాలు.! ఒకరిని మించి మరొకరు అన్నట్టు విజయ యాత్రలు.! మేమేం తక్కువా అన్నట్టు డబుల్స్ జంటలు అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి-మను అత్రి అదరగొడుతుంటే కొన్నేళ్లు నుంచి ఇండియా బ్యాడ్మింటన్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది.! కానీ ఈ ఏడాది మాత్రం మన షటర్ల జోరుకు బ్రేకులు పడ్డాయి. కరోనా మహమ్మారి పుణ్యమా టోర్నీలన్నీ వాయిదాపడగా.. జరిగిన వాటిలో మన రాకెట్లు తుస్సుమన్నాయి.!

హైదరాబాద్: భారత్ బ్యాడ్మింటన్‌కు 2020 నిరాశనే మిగిల్చింది. కరోనా పుణ్యమా ఆటలన్నీ ఆగమాగమవ్వగా.. అందులో బ్యాడ్మింటన్ మరీ ఎక్కువగా ప్రభావితమైంది. ప్రాణాంతక వైరస్ పుణ్యమా టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడగా.. బ్యాడ్మింటన్ టోర్నీలు చాలా రద్దయ్యాయి. ప్రస్తుతానికి మిగతా క్రీడా టోర్నీలు ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుండగా.. బ్యాడ్మింటన్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఇక కరోనా ముందు జరిగిన టోర్నీల్లోనూ భారత షట్లర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ భారంగానే గడిచింది.

ఆరంభం అదరలేదు..

ఆరంభం అదరలేదు..

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మలేషియా టూర్‌లో భారత షట్లర్లు దారుణంగా విఫలమయ్యారు. పురుషల కేటగిరిలో ఏ ఒక్క ప్లేయర్ కూడా కనీసం రెండో రౌండ్ దాటలేకపోయాడు. ఇక మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌కే పరిమితమైంది. వరల్డ్ నెంబర్ వన్ తై జూ యింగ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ సైనా నేహ్వాల్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటి దారి బట్టింది. రియో ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ కరోలినా మారిన్ చేతిలో సైనా ఖంగుతిన్నది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటి దారి పట్టగా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్ సిక్కీ రెడ్డి కూడా తొలి రౌండ‌లోనే నిష్క్రమించారు.

ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లో అదే వైఫల్యం..

ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లో అదే వైఫల్యం..

ఇక భారత షట్లర్ల వైఫల్యం ఇండనేషియా, థాయ్‌లాండ్ ఓపెన్‌లోనూ కొనసాగింది. ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ఒక్క భారత ఆటగాడు కూడా ఫస్ట్ రౌండ్ దాటలేకపోయాడు. సైనా సైతం ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టగా.. సింధు రెండో రౌండ్‌లో వెనుదిరిగింది. సాత్విక్, చిరాగ్ జోడీ కూడా ఫస్ట్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. థాయ్‌లాండ్ మాస్టర్స్‌లోనూ ఇదే కథ రిపీట్ అయింది.

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ..

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ..

ఇక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ భారత షట్లర్ల వైఫల్యం కొనసాగింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సింధు కూడా క్వార్టర్స్ ఫైన‌ల్లోనే నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి ఒకుహరా చేతిలో సింధు ఖంగుతిన్నది. ఇక కరోనా పుణ్యమా యూఎస్ ఓపెన్, జెర్మన్ ఓపెన్, కెనాడా ఓపెన్, తైపీ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, జపాన్ ఓపెన్, డచ్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్, మలేషియా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ రద్దయ్యాయి. ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన భారత బ్యాడ్మింటన్ స్టార్స్.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ కోసం సమాయత్తం అవుతున్నారు.

Story first published: Friday, December 18, 2020, 16:17 [IST]
Other articles published on Dec 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+