Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2024: సెమీస్‌లో రిబకినా, జొకోవిచ్!

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మాజీ ఛాంపియన్ ఎలీనా రిబకినా, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సెమీఫైనల్ చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 2022 ఛాంపియన్ రిబకినా 6-3, 6-2 తేడాతో స్వితోలినా(ఉక్రెయిన్)పై విజయం సాధించింది. పదునైన సర్వీస్‌లతో చెలరేగిన రిబకినా అదే జోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది.

ఈ మ్యాచ్‌లో రిబకినా 7 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. తొలి సెట్ మొదటి గేమ్ కోల్పోయిన రిబకినా ఆ వెంటనే పుంజుకుంది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్వితోలినా కూడా ప్రతిఘటించడంతో స్కోర్ సమమైంది. ఇక అక్కడి నుంచి రిబకినాకు ఎదురు లేకుండా పోయింది. రెండో సెట్లోనూ అదే జోరును కొసాగించి విజయాన్నందుకుంది.

Wimbledon 2024 Novak Djokovic and Elena Rybakina reaches semifinal

మరో క్వార్టర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్, 31వ సీడ్ క్రెజికోవా 6-4, 7-6(7-4)తో 13వ సీడ్ వొస్తా పెంకో(లాత్వియా)ను ఓడించి తొలి సారి సెమీఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో ప్రత్యర్థి ఆటగాడు గాయంతో తప్పుకోవడంతో నొవాక్ జొకోవిచ్‌కు వాకోవర్ లభించింది. దాంతో జొకోవిచ్ 13వ సారి వింబుల్డన్ సెమీస్ చేరాడు. ఈ క్రమంలో అతను రోజర్ ఫెదరర్ రికార్డ్‌ను సమం చేశాడు.

Story first published: Thursday, July 11, 2024, 12:23 [IST]
Other articles published on Jul 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+