కనులవిందుగా పీవీ సింధు పెళ్లి దావత్.. హాజరవ్వని సచిన్ టెండూల్కర్!
భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు-వెంకట దత్త సాయిల పెళ్లి దావత్ ఘనంగా జరిగింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన ఈ రిసెప్షన్‌కు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా పీవీ సింధు-వెంకట దత్త సాయిలకు ఆశీస్సులు అందించారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సుజనా చౌదరి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అర్జున్, అలీ, మృణాల్ ఠాకూర్, అజిత్‌లు ఈ వేడుకలో భాగమయ్యారు. క్రీడా రంగం నుంచి భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్లు గురుసాయి దత్, ప్రణయ్, చిరాగ్ శెట్టి, చాముండేశ్వరినాథ్‌లు హాజరయ్యారు.
టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ వేడుకకు హాజరవ్వలేదు. సింధు తన తొలి వివాహ ఆహ్వాన కార్డును క్రికెట్ దేవుడుగా పిలిచే సచిన్ టెండూల్కర్ అందజేసినట్లు వార్తలు వచ్చాయి. తన భర్త వెంకట దత్త సాయితో కలిసి సింధు ముంబై వెళ్లి సచిన్ కుటుంబాన్ని కలిశారు. ఈ విషయాన్ని సచిన్ టెండూల్కరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సింధు తనను కలిసిన ఫొటోను సచిన్ ట్వీట్ చేశారు. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాంటిది సచిన్ పీవీ సింధు వివాహ వేడుకకు హాజరవ్వలేదు. అయితే ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన పెళ్లికి వెళ్లి ఉండవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతోనే సచిన్ పీవీ సింధు రిసెప్షన్‌కు హాజరవ్వలేకపోయాడని అభిప్రాయపడుతున్నారు.
Thala Ajith attends PV Sindhu wedding reception💐#Ajithkumar𓃵 | #PVSindhuWedding pic.twitter.com/K0JIx1EifZ
— Tiger Siva🐅 (@ssrkarr) December 24, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications