
నీ బాధ నాకు తెలుసు..
గత ఒలింపిక్స్‌లో మారిన్ చేతిలో ఓడిన సింధు.. సరిగ్గా అదే పరిస్థితుల్లో ఉన్న తైజు యింగ్‌ను అక్కున చేర్చుకుంది. ఆమెతో మాట్లాడి బాధను పోగొట్టింది. 'ఫైనల్ మ్యాచ్ ముగిసాక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే అనిపించింది. ఆ తర్వాత సింధు పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుంది. నా ముఖం పట్టుకొని ఇలా చెప్పింది. 'నీకు అసౌకర్యంగా ఉంటుందని తెలుసు. నువ్వు చాలా బాగా ఆడావు. కానీ ఈరోజు నీది కాదు' అని తెలిపింది. ఆ తర్వాత తన భుజాలపైకి తీసుకొని ఇలాంటి అవస్థ తనకు అనుభవమేనని పేర్కొంది' అని తైజు తన ఇన్‌స్టాలో పేర్కొంది.

సింధు.. బిగ్ థ్యాంక్స్ .
'ఫైనల్ ఓటమి అనంతరం సింధు ఓదార్చిన తీరు నాకు కన్నీరు తెప్పించింది. నిజానికి నేను బాధపడ్డాను. ఎందుకంటే నేనెంతో కష్టపడ్డాను. సింధూ.. నీ మద్దతు, ప్రోత్సాహానికి మరోసారి బిగ్ థ్యాంక్స్. ఇక నా ప్రయాణంలో తోడుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మూడోసారి నేను కొన్ని కలలతో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టాను. ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకున్నాను. కానీ పోడియంపై అత్యున్నత ఎత్తులో నిలబడలేదు. కచ్చితంగా ఎంతో కొంత బాధ ఉంటుంది.

నా శక్తికి మించి ఆడాను..
ఎందుకంటే ఎవరూ పరిపూర్ణం కాదు. ఇకపై మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాను. మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదో తెలియదు. కానీ పతకం సాధించాను. నేను గొప్ప క్రీడాకారిణిని అని చెప్పుకున్నాను. ఫలితాలు ఎప్పుడైనా కఠినంగానే ఉంటాయి. వాటిని అంగీకరించాల్సిందే. ఏదేమైనా నేనైతే శక్తికి మించి కష్టపడ్డాను' అని తైజు చెప్పుకొచ్చింది. సింధుతో జరిగిన సెమీఫైనల్లో తైజూయింగ్ 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












