పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి దుమ్మురేపారు. అసాధారణ ప్రదర్శనతో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లోప్రపంచ మూడో ర్యాంకర్లు సాత్విక్-చిరాగ్ 21-15, 21-15 తేడాతో చెన్ బో యంగ్-లియ యి(చైనా)పై విజయం సాధించారు.
పురుషుల డబుల్స్‌లో భారత డబుల్స్ జోడీకి ఇది 9వ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్. మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన సాత్విక్-చిరాగ్.. ఆ తర్వాత మాలేసియా సూపర్ 1000, ఇండియా సూపర్-750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు.

ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు దూసుకొచ్చిన సాత్విక్-చిరాగ్ అదే జోరును టైటిల్ ఫైట్‌లోనూ కొనసాగించారు. 5-1తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సాత్విక్ ద్వయాన్ని ఆరంభంలో చైనీస్ జంట నిలువరించింది. 39 షాట్ల ర్యాలీని గెలిచి స్కోర్‌ను 7-7తో సమం చేసింది.
అదే జోరులో 10-7తో ముందంజ వేసినా సాత్విక్-చిరాగ్ బుల్లెట్స్ లాంటి రిటర్న్స్‌తో కట్టిపడేశారు. 14-11 లీడ్‌తో సునాయసంగా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో 8-3తో ఆధిక్యంలో నిలిచిన భారత జోడీ.. అదే జోరును కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.