Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Thailand Masters: శ్రీకాంత్ శుభారంభం

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీ‌లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్‌ ముత్తుస్వామి, మిథున్‌ మంజునాథ్‌ శుభారంభం చేశారు. సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జిలు మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 22-20, 21-19తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు.

45 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వరుసగా రెండు సెట్లను గెలిచి చైనా షట్లర్‌ను మట్టికరిపించాడు.ఈ మ్యాచ్‌లో ఇద్దరు షట్లర్లు హోరా హోరీగా తలపడ్డారు. ఫస్ట్ సెట్‌లో చెరో పాయింట్‌తో ముందుకు సాగారు. వరుసగా రెండు పాయింట్స్‌తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్న శ్రీకాంత్.. రెండో సెట్‌లోనూ అదే ఆధిపత్యం విజయం సాధించాడు.

Thailand Masters: Kidambi Srikanth advances to second round after win over wang tzu wei

ఇతర మ్యాచ్‌ల్లో శంకర్‌ ముత్తు స్వామి 21-14, 21-17తో లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా)ను ఓడించగా.. మిథున్‌ మంజు నాథ్ 21-17, 21-8తో జేసన్‌ (హాంకాంగ్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 14-21, 18-21తో లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా... లె లాన్‌ జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి తొలి గేమ్‌ను 17-21తో కోల్పోయాక గాయంతో వాకోవర్ తీసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో అష్మిత, మాళవిక ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టగా... హైదరాబాద్‌ అమ్మాయి సామియా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

అష్మిత 21-10, 21-16తో వాంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై, మాళవిక 22-20, 21-8తో ఇనెస్‌ (పెరూ)పై విజయం సాధించగా... సామియా 14-21, 18-21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమిపాలైంది.

Story first published: Thursday, February 1, 2024, 8:32 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+