For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Spain Masters 2023: తొలిసారి ఫైనల్ చేరిన పీవీ సింధు!

మాడ్రిడ్‌: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది వరుస పరాభవాల నుంచి బయటపడుతూ.. తొలిసారి ఓ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో సింధు 24-22, 22-20తో సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌పై గెలుపొందింది.

వరుస వైఫల్యాలతో సతమతమై.. ఇటీవలే బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు కోల్పోయిన సింధు.. ఈ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన సింధు.. వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించింది. తనదైన శైలిలో స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 48 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించిన సింధూ.. సింగపూర్ షట్లపై నేరుగా నాలుగో విజయాన్నందుకుంది.

Spain Masters 2023: PV Sindhu enters first final of the year with straight set win over Yeo Jia

ఆదివారం జరిగే ఫైనల్లో పీవీ సింధు.. టాప్ సీడ్, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ లేదా ఇండోనేషియా షట్లర్ జార్జియా మరిస్కాలతో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే ప్లేయర్‌తో సింధు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

పురుషుల సింగిల్స్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 18-21, 15-21తో కెంటా నిషిమోటో (జపాన్‌) చేతిలో ఓడాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్‌ నుంచి సింధు మాత్రమే పోటీలో ఉంది.

Story first published: Saturday, April 1, 2023, 22:49 [IST]
Other articles published on Apr 1, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+