Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దేశం కోసం నా బిడ్డ పతకాలైనా గెలిచింది.. నువ్వేం పీకినవ్! హీరో సిద్దార్థ్‌పై సైనా తండ్రి ఫైర్!

Saina Nehwals father slams actor Siddharth, says My daughter has won medals for India, what has he done?

హైదరాబాద్: సౌతిండియా హీరో సిద్థార్థ్‌పై భారత టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశం కోసం తన కూతురు మెడల్స్ అయిన గెలిచిందని, అత్యున్నత స్థాయిలో తన ఆటతో మువ్వెన్నల జెండాను రెపరెపలాడించిందని, కానీ సిద్దార్థ్ దేశం కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. ఇక సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి సిద్దార్థ్ ట్విటర్ వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్దార్థ్ వాడిన భాష బాలేదని నెటిజన్లతో పాటు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లగా.. ఆయనను అక్కడి నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీకే భద్రత కల్పించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఓ వర్గం ప్రశ్నించగా.. మరో వర్గం మాత్రం ఆ ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎదురైన ఈ ఘటనపై సైనా నెహ్వాల్ కూడా స్పందించింది.

ప్రధానికే రక్షణ లేకపోతే దేశంలో ఇంకెవరికి రక్షణ ఉంటుందని పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. ‘‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం సేఫ్‌గా ఉన్నామని ఎలా చెప్పుకోగలం. ఆటంకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా'' అని ఆమె ట్వీట్‌‌లో పేర్కొంది. సైనా ట్వీట్ పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన సిద్దార్థ్.. కాక్ చాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సైనా మీద సెటైర్లు పేల్చాడు.

చిన్న కాక్ చాంపియన్...

చిన్న కాక్ చాంపియన్...

చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్‌.. ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్‌ చేశాడు. సిద్దార్థ్ వాడిన కాక్ పదం భిన్న అర్థాలకు దారితీసేటట్లు ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ మహిళా కమిషన్‌ సైతం సిద్దార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.

Saina Nehwal, HS Prannoy Test Positive For Covid-19
దేశం కోసం ఏం చేశావ్..

దేశం కోసం ఏం చేశావ్..

ఈ వివాదం నేపథ్యంలో టైమ్స్‌ నౌతో మాట్లాడిన సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌... సిద్దార్థ్ మండిపడ్డాడు. ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను పెంచింది' అని సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారత సమాజం గొప్ప విలువలు కలిగినది. జర్నలిస్టులు, క్రీడా ప్రముఖులు సైనాకు మద్దతుగా నిలిచారు.తను ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకు తెలుసు కాబట్టే.. తన విలువను గుర్తించారు'' అని హర్వీర్ భావోద్వేగానికి గురయ్యారు.

జాతీయ మహిళా కమిషన్‌ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్‌పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్‌పై మండిపడుతున్నారు. కాగా పలు ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, January 11, 2022, 16:11 [IST]
Other articles published on Jan 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+