హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. అతని పైన సినిమా తీసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు.. వీరిద్దరిలో ఎవరిని మలుచుకోడం పెద్ద సవాల్ అని మీడియా అడిగింది.
సింధుని కొడితే అక్క ఏడ్చేది, మోకాళ్ల నొప్పులన్నా వినని గోపీచంద్దీనిపై గోపీచంద్ స్పందిస్తూ.. నేను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వనని, ఇప్పుడు తాను సింధు గెలుపును ఆస్వాదించే పనిలో ఉన్నానని వ్యాఖ్యానించారు. గతంలో రెండేళ్ల క్రితం తనను నుంచి విడిపోయిన సైనా నెహ్వాల్ విమర్శలు గుప్పించినప్పుడు కూడా గోపీచంద్ మాట్లాడలేదు.
కాగా, సింధు గెలుపు అనంతరం ఆకలి, అలసట వేధిస్తున్నా మీడియాతో గోపీచంద్ ఎంతో సంయమనంతో మాట్లాడారు. గోపీచంద్ అకాడమీలోనే సింధు, సైనా నెహ్వాల్ శిక్షణ పొందారు. వీరిద్దరిలో ఎవరికి శిక్షణ ఇవ్వడం కష్టమనిపించిందనే ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెప్పలేదు. సింధు గెలుపును ఆస్వాదించడమే ముఖ్యమన్నారు.

సింధు తాను చెప్పిన సమయానికే ఎప్పుడూ శిక్షణకు వచ్చేదన్నారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు రమ్మని చెబితే వెంటనే సరేనని చెప్పేదని, అలా కాదు పావు తక్కువ ఐదుకు వస్తానని, లేదంటే ఐదు గంటలకు వస్తానని ఎప్పుడూ చెప్పేది కాదన్నాడు.
మూడు నెలల నుంచి ఆమె సెల్‌ఫోన్ తనవద్దే ఉందని చెప్పాడు. ఆమె శిక్షణకు ఎటువంటి అంతరాయాలు కలుగకుండా చూడటానికే సెల్‌ఫోన్ ఆమెకు అందుబాటులో లేకుండా చేశానన్నాడు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఆమెకు ఇచ్చేశానన్నాడు.
అంతేకాకుండా జంక్ ఫుడ్ తినవద్దని చెబితే కచ్చితంగా పాటించిందని, అంతటి క్రమశిక్షణతో శిక్షణ పొందిందని చెప్పాడు. పీవీ సింధు నెంబర్ వన్ ఎప్పుడవుతుందనే విషయమై మాట్లాడుతూ.. ఆమెకు శక్తి ఉందని, అలాగే ఆమె ఇంకా చిన్న పిల్ల అని, చూద్దాం అన్నాడు.
రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. అతని పైన సినిమా తీసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు.. వీరిద్దరిలో ఎవరిని మలుచుకోడం పెద్ద సవాల్ అని మీడియా అడిగింది.