
పీవీ సింధును కొడితే అక్క ఏడ్చేది
రియో ఒలింపిక్స్ 2016లో బ్యాడ్మింటన్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకు తన అక్క అంటే చాలా ఇష్టమని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అలాగే, అక్కకు చెల్లి అంటే ఇష్టమన్నారు. చిన్నప్పుడు సింధును చదువుకోమని కొడితే వాళ్లక్క దివ్య ఏడిచేదన్నారు.

గోపీచంద్ తీసుకునే ఆహారం..
గోపీచంద్ ఏ ఆహారమైనా తీసుకుంటాడని, వివిధ దేశాల్లో పర్యటిస్తుంటారని, కాబట్టి అన్ని రకాల పుడ్ తినగలుగుతారని ఆయన భార్య అన్నారు. అలాగే, ఏమీ తినకుండా కూడా ఉండగలరన్నారు.

పీవీ సింధు పైన గోపీచంద్ భార్య
పీవీ సింధు చాలా స్వీట్ అమ్మాయని, అందరితో బాగుంటుందని కోచ్ గోపీచంద్ సతీమణి చెప్పారు. సింధు యాటిట్యూడ్‌ను గోపీచంద్ బాగా ఇష్టపడతారన్నారు.

మోకాళ్ల నొప్పులన్నా...
రియోకు నాలుగు నెలల ముందు నుంచి హైడ్రేడ్ పుట్స్ మానేయాలని సింధుకు గోపీచంద్ సూచించారని సింధు తల్లిదండ్రులు చెప్పారు. మోకాళ్ల నొప్పులు వస్తున్నాయన్నా ప్రాక్టీస్ కొనసాగాలని చెప్పారన్నారు.

29న ఖేల్ రత్న, 28న సచిన్ చేతుల మీదుగా కారు
ఈ నెల 28వ తేదీన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా పీవీ సింధుకు చాముండేశ్వరినాథ్ కారు ఇప్పించనున్నారు. అలాగే, 29న ఢిల్లీలో ఖేల్ రత్న అందుకోనుంది. కాగా, సల్మాన్ ఖాన్.. పీవీ సింధుతో గతంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు.


Click it and Unblock the Notifications











