Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయం డ్రామాతో నన్ను ఓడించింది: పీవీ సింధు

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మాజీ ఛాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో ఆరో మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో పీవీ సింధు 11-21, 21-15, 17-21 తేడాతో వరల్డ్ నెంబర్ 3 వాంగ్ జి యీ(చైనా) చేతిలో ఓడింది. 1 గంట 28 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

తొలి గేమ్ ఓడిన సింధు.. రెండో గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన సింధు 7-4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత వాంగ్ పుంజుకున్నా సింధు 13-10తో పై చేయి సాధించింది. కానీ క్రాంప్స్‌తో వాంగ్ పదే పదే విరామం తీసుకుంది. ప్రత్యర్థి బ్రేక్స్‌‌తో సింధు రిథమ్ కోల్పోయింది.

PV Sindhu Questions Wang Zhi Yi s Cramps After World Championships Exit Says Maybe That Was Her Tactic

గాయం ఎత్తుగడ కావొచ్చు..

ఈ మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ.. వాంగ్ జి యీ గాయం డ్రా ఆడి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. 'వాంగ్‌కు గాయం అయిందో లేదో నాకు తెలియదు. అది ఆమె ఎత్తుగడలో భాగం కావొచ్చు. ప్రతి పాయింట్ కీలకమైన పరిస్థితుల్లో ఆమె విరామం తీసుకుంది. ఏది ఏమైనా చివరి నిమిషాల్లో నేను మరింత ఓపిగ్గా ఆడాల్సింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీలను పాయింట్లుగా మార్చుకోవాల్సింది. నా తప్పులు దిద్దుకుని మరింత బలంగా వస్తా.'అని పీవీ సింధు పేర్కొంది.

మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోనే కండరాలు పట్టేసాయని వాంగ్ జి యీ తెలిపింది. 'నాకు నేను బాగా ఒత్తిడికి గురిచేసుకోవాల్సి వచ్చింది. అందుకే నాకు కండరాల నొప్పులు వచ్చాయి. నేను గాయం డ్రామా ఆడానని సింధు అనుకోవచ్చు. కానీ నేను నిజంగా గాయపడ్డాను. ఈ మ్యాచ్ చాలా కష్టంగా సాగింది. ఆమె చాలా బలమైన ప్రత్యర్థి. చాలా వేగంగా అటాక్ చేస్తుంది. నా వ్యూహం ఫలించింది. ఈ రోజు నా ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నా.'అని వాంగ్ జి యీ పేర్కొంది.

పురుషుల సింగిల్స్‌లో యువ కెరటం ఆయుష్ శెట్టి పోరాటం కూడా ముగిసింది. ప్రిక్వార్ట్స్‌లో అతను 19-21, 11-21తో ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు ఫర్హాన్(ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.

క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ..

భారత డబుల్స్ జోడీ సాత్విక్-సాయిరాజ్ చిరాగ్ శెట్టి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-23, 21-19, 21-17తో జునైది ఆరిఫ్-యాప్ య్(మలేసియా)ద్వయంపై గెలుపొందింది. ప్రత్యర్థి జంట నుంచి గట్టి పోటీ ఎదురైనా.. తొలి గేమ్ కోల్పోయినా.. భారత్ జోడీ ముందంజ వేసింది.

Story first published: Friday, August 21, 2026, 10:38 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+